Share News

TEACHERS PROBLEM : 117 జీఓను రద్దుచేయాలి: ఎస్టీయూ

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:04 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం 117 జీఓను రద్దు చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు జీవం పోయాలని ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కోనంకి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం మండలంలోని కొడపగానిపల్లి జిలా ్లపరిషత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సంబంధిత కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ... సీపీఎస్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాతపెన్షన విధానాన్ని పునరుద్ధ రించాలన్నారు.

TEACHERS PROBLEM : 117 జీఓను రద్దుచేయాలి: ఎస్టీయూ
117 STU leaders released pamphlets to cancel GO

కొత్తచెరువు, జూలై 6: టీడీపీ కూటమి ప్రభుత్వం 117 జీఓను రద్దు చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు జీవం పోయాలని ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కోనంకి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం మండలంలోని కొడపగానిపల్లి జిలా ్లపరిషత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సంబంధిత కరపత్రాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ... సీపీఎస్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాతపెన్షన విధానాన్ని పునరుద్ధ రించాలన్నారు. అలాగే డీఎస్సీ నోటిషికేషనలో పాత పెన్షన విదానంతో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యా యులకు పీఎఫ్‌ సదుపాయాన్ని కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించా లన్నారు. పలువురు ఉపాధ్యాయుల పదవీ విరమణ వల్ల,


ఉద్యోగోన్నతుల వల్ల చాలా ఉన్న త పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయ న్నారు. వాటిని తాత్కాలిక ప్రాదిపతికన వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి గొర్ల రవిచంద్ర, నాయకులు వెంగమనాయుడు, కిష్టప్ప పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి: ఏపీటీఎఫ్‌

ధర్మవరం: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 117 జీఓను వెంటనే రద్దుచే యాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్రారెడ్డి డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనం చేపట్టి ప్రాథమిక విద్యా వ్యవస్థను చిన్నాబిన్నం చేసిన జీఓ 117ను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. అదేవిదంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పరిష్కరించాలని, మున్సిపల్‌ పాఠశాల లకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణగా ఉపాద్యాయులను సర్దుబాటు చేయాలని, అప్ర్గేడ్‌ అయిన ఉన్నతపాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలనే పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ పట్టణ అద్యక్ష, ప్రదానకార్యదర్శులు శ్రీనివాసులు, జగదీశ, నాగభూషణ, వెంకటేశ, అమానుల్లా, చెన్నుడు, అంజినాయక్‌, చంద్రశేఖర్‌, మోహన పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2024 | 12:04 AM