HOSPITAL : ఐదు నెలలుగా మూతపడ్డ హోమియో ఆసుపత్రి
ABN , Publish Date - Aug 11 , 2024 | 11:41 PM
మండలంలోని కల్లుమర్రి గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో డాక్టర్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. మండల వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడుతున్న రోగులు కల్లుమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న హోమియో ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న డాక్ఠర్ ఐదేళ్ల కిందట బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి ఫార్మసిస్టులతోనే నడుస్తోంది. డాక్టర్ లేకపోయినా ఫార్మసిస్టు ఇచ్చే మందులతోనే రోగులు సంతృప్తిచెందుతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఫార్మసిస్టు డిప్యుటేషనపై పరిగి మండలంలోని సేవమందిర్కు వెళ్లారు.
ఇబ్బందులు పడుతున్న రోగులు
మడకశిర రూరల్, ఆగస్టు 11: మండలంలోని కల్లుమర్రి గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో డాక్టర్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. మండల వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడుతున్న రోగులు కల్లుమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న హోమియో ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న డాక్ఠర్ ఐదేళ్ల కిందట బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి ఫార్మసిస్టులతోనే నడుస్తోంది. డాక్టర్ లేకపోయినా ఫార్మసిస్టు ఇచ్చే మందులతోనే రోగులు సంతృప్తిచెందుతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఫార్మసిస్టు డిప్యుటేషనపై పరిగి మండలంలోని సేవమందిర్కు వెళ్లారు. దీంతో ఐదు నెలలుగా హోమియో ఆసుపత్రి మూతపడింది. హో మియోపతి మందులు వాడేవారు ఎక్కువుగా పట్టణ వాసులే. విషయం తెలియని చాలామంది రోజూ వ్యయప్రయాసులకోర్చి కల్లుమర్రిలోని ఆసుపత్రికి వెళ్తున్నారు. అయితే అక్కడ ఆసుపత్రి మూతపడి ఉండడంతో నిరాశతో వెనుతిరిగి వస్తున్నా రు. మరికొంత మంది హింధూపురం వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులలో మందులు కోనుగోలు చేస్తున్నా రు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే హోమియో ఆసుత్రికి డాక్టర్ ను, ఫార్మసిస్టును నియమించాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.
మడకశిరకు మార్చండి
మండలంలోని కల్లుమర్రి గ్రామంలో ఉన్న హోమియో ఆసుపత్రిని మడకశిరకు మార్చాలని ప్రజలు, రోగులు కోరుతున్నారు. గతంలో మడకశిరలో ఉన్న ఈ ఆసుపత్రికి భవనాలు లేని కారణంగా కల్లుమర్రి గ్రామానికి మార్చారు. హోమియోపతి మందులు వాడేవారు అధికంగా పట్టణవాసులే ఉన్నారు. ఉన్నతాధికారులు పరిశీలించి ఈ ఆసుత్రిని మడకశిరకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు