Share News

KESHAV: గజమాలతో కేశవ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:28 AM

మండలంలోని జనార్దనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు భారీ గజమాలతో గ్రామస్థులు, మహిళలు సోమవారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ టీడీపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

KESHAV: గజమాలతో కేశవ్‌కు ఘన స్వాగతం
గజమాలతో కేశవ్‌ను సత్కరిస్తున్న జనార్దనపల్లి టీడీపీ నాయకులు

విడపనకల్లు, ఏప్రిల్‌ 29: మండలంలోని జనార్దనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు భారీ గజమాలతో గ్రామస్థులు, మహిళలు సోమవారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షోలో పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ టీడీపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మండలంలోని పెద్ద కొట్టాలపల్లి, విడపనకల్లు, వేల్పుమడుగు, జనార్ధనపల్లి, వీ కొత్తకోట, ఆర్‌ కొట్టాల గ్రామాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన రాష్ట్రంలోని మహిళలకు ఆసరా డబ్బులు వేస్తున్నాని ఉత్తుత్తి బొటన నొక్కి మోసం చేశాడన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించి టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాభివృద్ధికి సహాకరించాలన్నారు


నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించి ఆర్థికంగా ఎదిగేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. పేదల అభివృద్ధికి పాటుపడుతున్న టీడీపీ సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అన్నారు. రోడ్డు షోలో పలువరు వైసీపీ నాయకులు కేశవ్‌ సమక్షంలో టీడీపీలోకి చేరారు. తిప్పారెడ్డి, చంద్రశేఖర్‌, తిమ్మరాజు, జనార్ధన నాయుడు, మండల కన్వీనర్‌ బీడీ చిన్న మారయ్య, లాయర్‌ ప్రతాప్‌ నాయుడు, అమరేంద్ర, రవీంద్ర, హరీ్‌షబాబు, మద్దిపాట్ల శ్రీనివాసులు, లక్ష్మీప్రసాద్‌, నూతేటి రామక్రిష్ణ, డీ దేవేంద్రప్ప, మాజీ సర్పంచ రామాంజనేయులు, వాల్మీకి హనుమంతు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే తనయులు ప్రచారం

ఉరవకొండ: వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలో ఎమ్మెల్యే తనయులు విక్రమ్‌సింహా, విజయ్‌సింహా సోమవారం ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. మండల కన్వీనర్‌ నూతేటి వెంకటేశులు, నాగేంద్ర, మండిఎర్రిస్వామి, దస్తగిరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 12:28 AM