TESTING: భూసార పరీక్షలు లేని అగ్రిటెస్టింగ్ ల్యాబ్
ABN , Publish Date - May 23 , 2024 | 11:44 PM
భూసార పరీక్షలు నిర్వహించని అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఎందుకు అని రైతులు వాపోతున్నారు. మడకశిర మార్కెట్ యార్డు అవరణంలో 2022లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నిర్మాంచారు. ఇందులో కేవలం విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తు న్నారు. ల్యాబ్ లోని రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు ఎరువులకు సంబంధించి 174 పరీక్షలు, విత్తనాలకు సంబంధించి 283 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మట్టి నమూనాలను అనంతపురం తీసుకెళ్లాల్సిన పరిస్థితి
అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు
మడకశిర రూరల్, మే 23: భూసార పరీక్షలు నిర్వహించని అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఎందుకు అని రైతులు వాపోతున్నారు. మడకశిర మార్కెట్ యార్డు అవరణంలో 2022లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నిర్మాంచారు. ఇందులో కేవలం విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తు న్నారు.
ల్యాబ్ లోని రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు ఎరువులకు సంబంధించి 174 పరీక్షలు, విత్తనాలకు సంబంధించి 283 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే నష్టాలు రాకుండా పంటలు సాగుచేయాలంటే రైతులు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించాలి. ఎంతో ముఖ్యమైన భూసార పరీక్షలు మాత్రం ఈ ల్యాబ్ చేయడంలేదు. భూసార పరీక్షలు కోసం రైతులు మట్టి నమూనాలను తీసుకోని అనంతపురం అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌కు వెళ్తున్నారు స్థానికం గా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఉన్నా ఉపయోగపడడంలేదని రైతులు వాపోతున్నారు..
ల్యాబ్ ఉన్నా.. ప్రయోజనం లేదు -గోవిందప్ప, మాజీ సర్పంచు, మణూరు
సాగుచేసే పంటల్లో నష్టాలు రాకుండా ఉండా లంటే రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. మడకశిరలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఉన్నా ప్రయోజనం లేదు. ఇక్కడ మట్టి పరీక్షలు జరుపరు. దీంతో మండలంలోని రైతులు మట్టి నమూనాలు తీసుకుని అనంతపురం వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే భూసార పరీక్షలు చేయించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నాం
సంబంధిత పరికరాలు రాలేదు- ఎలిజిబెత, వ్యవసాయాధికారి, అగ్రి టెస్టింగ్ ల్యాబ్, మడకశిర
భూసార పరీక్షలకు సంబంధించి అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌కు ఇప్పటి వరకు యంత్రపరికరాలు రాలేదు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలంటే మట్టి నమూనాలు తీసుకుని అనంతపురం వెళ్లాలి. అక్కడ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు మాత్రమే ఇక్కడి ల్యాబ్‌లో నిర్వహిస్తున్నాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....