DC: మద్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - May 04 , 2024 | 11:29 PM
ఈ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అక్రమ మద్యం రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సెబ్ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. ఆయన శనివారం పెనుకొండలోని సెబ్ స్టేషనను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అక్రమ మద్యం నిలువచేసే గోదా ములను, రవాణా మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలని, సరిహద్దులలో చెక్‌పోస్టులను మరింత బలోపేతంచేసి అక్రమ మద్యం కట్టడి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
సెబ్ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కుమార్
సెబ్ స్టేషన తనిఖీ
పెనుకొండ రూరల్, మే 4 : ఈ నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అక్రమ మద్యం రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సెబ్ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. ఆయన శనివారం పెనుకొండలోని సెబ్ స్టేషనను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అక్రమ మద్యం నిలువచేసే గోదా ములను, రవాణా మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు.
పాత నేరస్తులపై నిఘా పెంచాలని, సరిహద్దులలో చెక్‌పోస్టులను మరింత బలోపేతంచేసి అక్రమ మద్యం కట్టడి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 136 కేసులు నమోదుచేసి 298లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకున్నట్లు తెలి పారు. నాటుసారా 17,170లీటర్లు ధ్వంసం చేసినట్లు తెలిపారు. 1064 కేసుల్లో 105వాహనాలు సీజ్ చేశామన్నారు. వివిధ కేసుల్లో ఉన్న 363 మందిని 109, 110సెక్షనల కింద బైండోవర్‌చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....