Share News

DM&HO:సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:27 AM

వర్షాల కారణంగా దోమలు ప్రబలుతాయని, వ్యాధులు పొంచి ఉంటాయని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు డీఎంహెచఓ పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులు పెరగడానికి దోమలు ప్రధాన కారణమని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు బెడద పెరుగుతుందని, జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని అన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల ...

DM&HO:సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త
EB Devi, MD, PhD speaking in the meeting

డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి

అనంతపురం టౌన, జూన 7: వర్షాల కారణంగా దోమలు ప్రబలుతాయని, వ్యాధులు పొంచి ఉంటాయని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు డీఎంహెచఓ పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులు పెరగడానికి దోమలు ప్రధాన కారణమని అన్నారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు బెడద పెరుగుతుందని, జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని అన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల


అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి, శుభ్రం చేయించాలని సూచించారు. దోమల నివారణకు మలాథియన స్ర్పే చేయించాలని అన్నారు. జ్వర పీడితులను గుర్తించి, వారికి మలేరియా, టైఫాయిడ్‌ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని, పాజిటివ్‌ ఉన్నవారికి అవసరమైన చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన పెంచాలని, జాగ్రత్తలు పాటించేలా చూడాలని అన్నారు. సమావేశంలో డీసీహెచఎ్‌స డాక్టర్‌ రవికుమార్‌, జీజీహెచ సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ భీమసేనాచారి, డీఎంఓ డాక్టర్‌ ఓబులు, పోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ రవిశంకర్‌, డెమోలు ఉమాపతి, త్యాగరాజు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2024 | 12:27 AM