SAND : ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
ABN , Publish Date - May 19 , 2024 | 12:25 AM
మండలంలోని రచ్చుమర్రి గ్రామం వద్ద నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ సంస్థ నిర్వాహకులను ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామస్థులు అడ్డుకున్నారు. రచ్చు మర్రి గ్రామం వద్ద ఉన్న వేదవతి హగరి నుంచి గతంలో ఓ ప్రైవేట్ సంస్థ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఇసుకను తవ్వి పొలాల్లో నిల్వ ఉంచింది. దీన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి అధికారుల ...
కణేకల్లు, మే 18: మండలంలోని రచ్చుమర్రి గ్రామం వద్ద నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ సంస్థ నిర్వాహకులను ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామస్థులు అడ్డుకున్నారు. రచ్చు మర్రి గ్రామం వద్ద ఉన్న వేదవతి హగరి నుంచి గతంలో ఓ ప్రైవేట్ సంస్థ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఇసుకను తవ్వి పొలాల్లో నిల్వ ఉంచింది. దీన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి అధికారుల ఆధీనంలో ఉన్న ఆ ఇసుక నిల్వలపై తాజాగా మరో ప్రైవేట్ సంస్థ కన్నేసింది.
అధికారుల అనుమతులు లేకుండా శనివారం ఉదయం యంత్రాన్ని తెచ్చి ఇసుకను వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ రుద్రముని అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామస్థుల సహకారంతో అడ్డుకున్నారు. శుక్రవారం రచ్చుమర్రి పక్కన ఉన్న వేపరాల వద్ద ఇసుక తవ్వేందుకు ప్రయత్నించిన ఆ సంస్థ శనివారం రచ్చుమర్రికి చేరుకొని ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా మరోమారు ఈ ప్రాంతవాసులు అడ్డుకున్నారు. అధికారులు అనుమతులు లేకుండా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....