BONALU ; గ్రామదేవతలకు బోనాలు
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:53 PM
మండలంలోని వేప కుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులు బోనాలు త్తుకుని వెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంత రం పోతలయ్యస్వామికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
ధర్మవరంరూరల్(కనగానపల్లి), జూలై23: మండలంలోని వేప కుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులు బోనాలు త్తుకుని వెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంత రం పోతలయ్యస్వామికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో వర్షాలు సమృద్దిగా కురిసి, పాడిపంటలు వర్ధిల్లాలని యేటా ఈ ఉత్సవం నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు.
గంగమ్మ దేవతకు...
అనంతపురం క్లాక్‌టవర్: నగరంలోని చాకలి ఐలమ్మ కాలనీలో రజక కులస్థులు ఆషాఢమాస మంగళవారం పురస్కరించుకుని గంగమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీతో పాటు పాతూరులోని రజకులు ఉదయం నుంచి గంగమ్మకు బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ రజకవృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య మా ట్లాడుతూ... జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురిసి, కరువు, కాటకాలు లేకుం డా చూడాని యేటా అమ్మ వారికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రజకులు పెద్ద ఎత్తున రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజకవృత్తి దారుల సమాఖ్య కార్యదర్శి హరికృష్ణ, నాయకులు లలిత, నాగప్ప, నాగరాజు, భూషణ, వీరాంజి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ దేవతకు...
శింగనమల: వర్షాలు కురవాలని కోరుకుంటూ మండలంలోని సోదన పల్లిలో గ్రామస్థులు మంగళవారం పెద్దమ్మ దేవతకు బోనాలు సమ ర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భగా ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయా నికి వచ్పి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గ్రామస్థులు మూగ జీవాలను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇలా అమ్మవరాకి పూజలు చేస్తే వర్షాలు వస్తాయనే నమ్మకమని గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....