Share News

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా

ABN , Publish Date - May 07 , 2024 | 12:19 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూపురంలో భూదందాలు, కబ్జాలు, అక్రమాలు పె రిగిపోయాయని, వాటికి చెక్‌ పెట్టేది తానే అని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప ట్టణ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాల నీ, చౌడేశ్వరీ కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు ముద్దిరెడ్డిప ల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా
Women offering obeisance to Balakrishna

ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ

హిందూపురం, మే 6: వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూపురంలో భూదందాలు, కబ్జాలు, అక్రమాలు పె రిగిపోయాయని, వాటికి చెక్‌ పెట్టేది తానే అని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప ట్టణ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాల నీ, చౌడేశ్వరీ కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు ముద్దిరెడ్డిప ల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మూడోసారి తనను గెలిపిస్తున్నారని, అ భివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతానన్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగుదే శం పార్టీ హిందూపురానికి, నందమూరి కుటుంబా నికి అడ్డా అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్క డి ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని, ఎన్టీఆర్‌ మూడుసార్లు గెలిచారన్నారు. నందమూరి హరికృ ష్ణ ఒకసారి, తాను మూడోసారి ఎమ్మెల్యే బరిలో ఉ న్నానన్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతంగా ఉందని... పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుందన్నారు. అన్నివర్గాలవారికి అండగా నిలుస్తుందన్నారు. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలకాల న్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


టీడీపీతోనే మహిళా సాధికారత : వసుంధరా దేవి

చిలమత్తూరు: మహిళా సాధికారత టీడీపీ తోనే సాధ్యమని నందమూరి వసుంధరా దేవి పేర్కొ న్నారు. ఆమె సోమవారం ఎంపీ అభ్యర్థి పార్థసారఽథి భార్య కమలమ్మతో కలిసి మండలంలోని కోడూరు తోపు వద్ద ఉన్న టెక్స్‌పోర్టు గార్మెంట్స్‌లోని మహిళా కార్మికులతో మాట్లాడారు. ఓటును అభ్యర్థించారు. మహిళలు అభి వృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారన్నారు.


టీడీపీ హయాంలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేదని, ఈ ప్రభుత్వంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మి, తెలుగు మహిళలు పరిమళ, శ్రీదేవి, కోడూరు మాజీ సర్పంచ సోమశేఖర్‌ తదితరులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

లేపాక్షి: నందరూరి వసుంధరాదేవి సోమవారం లేపాక్షి పంచాయతీ గొంగటిపల్లి, సోమిరెడ్డిపల్లి, గలిబి పల్లిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులతో స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను, ఎంపీ అభ్యర్థి బీకే పార్థ సారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 07 , 2024 | 12:19 AM