Share News

TDP: తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి: అశ్మిత రెడ్డి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:37 AM

సైకిల్‌ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు.

TDP: తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి: అశ్మిత రెడ్డి
ప్రచారంలో చిన్నారిని ఆప్యాయంగా పలకరిస్తున్న జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌29: సైకిల్‌ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. టీడీపీకి అండగా నిలబడి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జేసీ సోదరులను కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు: స్థానిక నివాసంలో సోమవారం జేసీ సోదరులను టీడీపీ నూతన జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిలను కలిసి శాలువాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఆయన తెలిపారు. అనంతరం కాకర్ల జయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 13కుటుంబాల సభ్యులకు వెంకటశివుడుయాదవ్‌ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సజ్జలదిన్నెకు చెందిన రంగనాథ, రంగయ్య, రమేష్‌, కంబగిరి, మల్లికార్జున, శీనయ్య, దేవేంద్ర ఉన్నారు.


టీడీపీతోనే రామరాజ్యం: టీడీపీ పాలనతోనే రామరాజ్యం సాధ్యమవుతుందని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని గన్నెవారిపల్లి, తిప్పారెడ్డిపల్లి, రెడ్డికాలనీల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


అశ్మితరెడ్డి మేనల్లుడి ప్రచారం: మండలంలోని గన్నెవారిపల్లికాలనీలో సోమవారం కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి మేనల్లుడు గుణపాటి విరాజ్‌రెడ్డి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 12:38 AM