COUNTING: కౌంటింగ్ ఏజెంట్లు నిబంధనలు పాటించాలి: ఈఆర్వో
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:39 PM
కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించాలని ఈఆర్వో కరుణకుమారి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల నియమ నిబంధనలపై ఆమె సమావేశం నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, జూన 1: కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల నిబంధనలు పాటించాలని ఈఆర్వో కరుణకుమారి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల నియమ నిబంధనలపై ఆమె సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంల ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఏజెంట్ తప్పనిసరిగా ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాసుపోర్ట్ సైజ్ ఫొటోలు తమ వెంట తీసుకోవాలన్నారు. తహసీల్దార్ చిట్టిబాబు, అర్బన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.
ఉరవకొండ: పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో శనివారం ఏజెంట్లకు ఆర్వో, జేసీ కేతనగార్గ్ కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఏజెంట్లు లేవనెత్తిన అంశాలపై ఆయన నివృత్తి చేశారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో ఎటువంటి ఆటంకాలు కలిగించరాదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపుతామన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటు చేశామని 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.