దళిత ద్రోహి జగన
ABN , Publish Date - May 03 , 2024 | 01:45 AM
సీఎం జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల 27 పథకాలను రద్దు చేసి, దళిత ద్రోహిగా నిలిచిపోయారని టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఎంఎస్ రాజు అన్నారు. పట్టణంలోని యాదవ కల్యా ణమండపం ఆవరణంలో గురువారం నిర్వహించిన దళి తుల ఆత్మీయ సమావేశంలో ఆయన నియోజకవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలిసి పా ల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు తెచ్చిన ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక ఆర్డినెన్సతో 25వేల మంది దళితులకు ఉద్యోగాలు లభించాయన్నారు. భూమి కొనుగోలు పథ కం కింద పేద దళితులకు 12 వేల ఎకరాలు ఇచ్చార న్నారు. అయితే ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన నిధులను ఇతర పథకాలకు మళ్లించి ఆర్థికం గా లబ్ధి పొందిన వ్యక్తి జగన అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు
మడకశిరటౌన, మే 2: సీఎం జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల 27 పథకాలను రద్దు చేసి, దళిత ద్రోహిగా నిలిచిపోయారని టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఎంఎస్ రాజు అన్నారు. పట్టణంలోని యాదవ కల్యా ణమండపం ఆవరణంలో గురువారం నిర్వహించిన దళి తుల ఆత్మీయ సమావేశంలో ఆయన నియోజకవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలిసి పా ల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు తెచ్చిన ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక ఆర్డినెన్సతో 25వేల మంది దళితులకు ఉద్యోగాలు లభించాయన్నారు. భూమి కొనుగోలు పథ కం కింద పేద దళితులకు 12 వేల ఎకరాలు ఇచ్చార న్నారు.
అయితే ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన నిధులను ఇతర పథకాలకు మళ్లించి ఆర్థికం గా లబ్ధి పొందిన వ్యక్తి జగన అన్నారు. ఎస్సీ అయిన తన పైనే ఎస్సీఎస్టీ కేసును పె ట్టించిన మూర్కుడన్నా రు. పులివెందులలో హత్యకు గురైన నాగమ్మఅనే దళిత మహిళ కుటుంబానికి న్యా యం చేయాలని పోరాడి తే తనపైనే కేసు పెట్టారన్నారు. తుగ్లక్‌రెడ్డి ఒక కులం అహంకారి అని, సామాజిక సమ తుల్యం పాటించడ న్నారు. దళిత బిడ్డలకు విద్యను దూరం చేసిన దుర్మార్గు డన్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం యాదవ కల్యాణ మండపంలో టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జ్‌ల సమావేశాన్ని నిర్వహించారు.
టీడీపీకి క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జ్‌లే పట్టుగొమ్మలని పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం పది రోజులు ఉం దని, మడక శిరలో టీడీపీ జెండా ఎగరాలంటే ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని ఎంఎస్ రాజు కోరారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య దర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, నియోజకవర్గం అధ్యక్షుడు ఆర్ జయకు మార్, మున్సిపల్ మాజీ ఛైర్మన సుబ్బరాయుడు, నాయకులు గోవిందప్ప, కన్నా, రాజు, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనన్నారు.
టీడీపీలోకి పలువురి చేరిక
మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. హరేసముద్రం గ్రామా నికి చెందిన వలంటీర్ కవిత, మరో 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు, నియోజకవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పే స్వామి గురువారం పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....