BALAYYA :టీడీపీతోనే అభివృద్ధి.. సంక్షేమం
ABN , Publish Date - May 04 , 2024 | 12:12 AM
టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షే మం పరుగులు పెడతాయని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అన్నారు. ఆమె శుక్రవారం పట్టణంలోని బోయపేట, విద్యానగర్, కోట ప్రాంతంలో ఎన్నిక ల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడోసారి బాలకృష్ణను గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పురం ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. పురంలో టీడపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసిన పని ఎక్కడైనా కనబడుతోందా అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో వసుంధరాదేవి
హిందూపురం, మే 3 : టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షే మం పరుగులు పెడతాయని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అన్నారు. ఆమె శుక్రవారం పట్టణంలోని బోయపేట, విద్యానగర్, కోట ప్రాంతంలో ఎన్నిక ల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడోసారి బాలకృష్ణను గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పురం ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. పురంలో టీడపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసిన పని ఎక్కడైనా కనబడుతోందా అని ప్రశ్నించారు. సీసీరోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, బెంగళూరు రోడ్డు విస్తరణ పనులతో పాటు పట్టణానికే చిహ్నంగా ఉన్న కూరగాయల మార్కెట్ టీడీపీ కాలంలో నిర్మించిందే అన్నారు. గొల్లపల్లి నుంచి నీటిని తెచ్చి దశాబ్దాల సమస్యను బాలకృష్ణ రూపుమాపారన్నారు. హిందూపురం ప్రజల ఆరోగ్యం, విద్యకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఎంతోమంది నిరుపేదలకు క్యాన్సర్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో వైద్యం అందించామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా వేలాది మంది దీర్ఘకాలిక రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి ప్రతినెలా మందులు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతా మన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన రావిళ్లలక్ష్మి, జేవీ అనిల్‌కుమార్, పట్టణా ధ్యక్షుడు రమేష్, హిదాయతుల్లా, హనుమంతు, శివ, మురళిస్వామి, చంద్రమోహన, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.
వైసీపీ రెబల్ అభ్యర్థి టీడీపీలోకి : ఈ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థిగా నా మినేషన దాఖలు చేసి పరిశీలనలో తిర స్కారానికి గురైన వెంకటేశరెడ్డి నంద మూరి వసుంధరాదేవి సమక్షంలో శుక్ర వారం టీడీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థి దీపిక భర్త వేణురెడ్డికి సమీప బంధువు కావడంతోపాటు సీఎం పర్యటనకు ముందురోజు వెంకటేశరెడ్డి టీడీపీలో చేరడం వైసీపీలో కలకలం రేపుతోంది. పార్టీలో చేరిన వెంకటే శరెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు తమవంతు కృషిచేస్తానని తెలిపారు. వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడమే కాక ఆ పార్టీలో అవకతవకలు జీర్ణించుకోలేక బయటకు వచ్చినట్లు తెలిపారు.
వైసీపీ సర్పంచ జయలలిత చేరిక
చిలమత్తూరు: మండలంలోని చాగలేరు పంచాయతీ సర్పంచ జయలలిత, ఆమె భర్త జనార్దన రెడ్డి, మరో వైసీపీ నాయకుడు శంకరరెడ్డి వైసీపీని వీడి శుక్రవారం నందమూరి వసుంధరాదేవి స మక్షంలో టీడీపీలో చేరారు. కొడికొండ చెక్‌పోస్టులోని రక్షా అకాడమిలో బస చేసిన నందమూరి వసుంధరా దేవిని వారు టీడీపీ మండల నాయకులు నాగరాజు యాదవ్, లక్ష్మీనారాయణయాదవ్, రంగారెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఆమె వారికి టీడీపీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....