Share News

water problem: తాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:35 AM

తనకల్లు, ఏప్రిల్‌ 29: మండలంలోని కొట్టువారి పల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో గత మూడునెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు.

water problem: తాగునీటి సమస్య పరిష్కరించాలని ధర్నా
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు

తనకల్లు, ఏప్రిల్‌ 29: మండలంలోని కొట్టువారి పల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఆ గ్రామానికి చెందిన మహిళలు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామంలో గత మూడునెలలుగా తాగునీటి సమస్య నెలకొందన్నారు.

గుక్కెడు నీరు లభించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో బోరులో నీరు పుష్కలంగా ఉన్నాయని, అయితే పంచాయతీ అధికారులు విద్యుత మోటారు అమర్చలేదని, దీంతో సమస్య నెలకొందని వాపోయారు. సమస్యను పలుమార్లు విన్నవించినా పంచాయతీ అధికారులు స్పందించలేదని తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మంచారు. అధికారులు డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ కృష్ణారెడ్డి ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు వచ్చి రెండురోజులలోపు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నెలరోజులుగా ఇదే విషయం చెబుతున్నారని, సమస్య పరిష్కారం కాలేదని మహిళలు మండిపడ్డారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కవిత వచ్చి ప్రతిరోజు రెండు ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. చివరకు అధికారులు నచ్చ చెప్పి ఆందోళన విరమింప చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 12:35 AM