SKU Janmabhoomi Canteen : అద్దె వసూలు చేసేరా..?
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:41 PM
అధికారం అండతో రెండేళ్ల కిందట ఎస్కేయూలోని జన్మభూమి క్యాంటిన స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకులు ఏడాదిగా అద్దె కూడా చెల్లించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఈ విషయం బయటపడింది. అధికారులు నోటీసులిచ్చినా వైసీపీ నాయకుల నుంచి ధిక్కారమే ఎదురవుతోంది. దీంతో విద్యుత కనెక్షన కట్ చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని వర్సిటీ అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు వర్సిటీ క్యాంప్‌సలో జన్మభూమి క్యాంటిన ...
జన్మభూమి క్యాంటిన అద్దె చెల్లించని నిర్వాహకులు
రూ. రెండు లక్షలకు పైగా బకాయి
అనంతపురం సెంట్రల్, జూలై 10: అధికారం అండతో రెండేళ్ల కిందట ఎస్కేయూలోని జన్మభూమి క్యాంటిన స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకులు ఏడాదిగా అద్దె కూడా చెల్లించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఈ విషయం బయటపడింది. అధికారులు నోటీసులిచ్చినా వైసీపీ నాయకుల నుంచి ధిక్కారమే ఎదురవుతోంది. దీంతో విద్యుత కనెక్షన కట్ చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని వర్సిటీ అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు వర్సిటీ క్యాంప్‌సలో జన్మభూమి క్యాంటిన ఏర్పాటుచేశారు. వందలాది మందితో ఈ క్యాంటిన నిత్యం రద్దీగా ఉంటుంది.
వ్యాపారం బాగా జరుగుతుందని వైసీపీ నాయకులే క్యాంటిన నిర్వహణను చేజిక్కించుకున్నారు. నెలకు రూ.20వేల చొప్పున అద్దె చెల్లించేలా టెండర్ ద్వారా కట్టబెట్టారు. ఈ మొత్తాన్ని కూడా సక్రమంగా చెల్లించకుండా వస్తున్నారు. దాదాపు రూ.2లక్షలకు పైగా అద్దె బకాయి ఉన్నట్లు వర్సిటీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వాటిపై కూటమి ప్రభుత్వం త్వరతగతిన స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మూసివేయిస్తాం
సకాలంలో అద్దె చెల్లించకుంటే నిబంధనల ప్రకారం క్యాంటిన మూసివేయించి, స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే రూ.2లక్షలకు పైగా బాడుగ రావాల్సి ఉంది. త్వరతగతిన చెల్లించాలని నిర్వాహకులకు నోటీసులిచ్చాం. విద్యుత సరఫరా నిలిపివేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలిచ్చాం. టెండర్ పిలిచేవరకు వర్సిటీలో ఆహార అవసరాల సమస్య లేకుండా చూడాలన్న సదుద్దేశంతోనే కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు.
- ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, ఎస్కేయూ రిజిసా్ట్రర్
మరిన్ని అనంతపురం వార్తల కోసం..