ELECTRICITY : విద్యుత శాఖ అత్యుత్సాహం
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:51 AM
అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్‌ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.
వైసీపీ నాయకుడి సేవకోసం...
అప్రకటిత విద్యుత కోతలు
హిందూపురం అర్బన, ఏప్రిల్ 22: అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్‌ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.
దీంతో పాటు రోజంతా పలు మార్లు కరెంటు పోతూ వస్తూ ఉంది. దీంతో బీబీ కాలనీ, నానెప్పనగర్, లక్ష్మీపురం, ప్రాంతాల్లో విద్యుత కోతలతో ఆ ప్రాంత ప్రజలు విలవిల్లాడారు. ఇళ్లలో ఉండలేక చెట్ల కింద కూర్చుని సేదతీరారు. సాధారణంగా ప్రతి శనివారం మెయిం టేనెన్స పేరుతో ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట దాకా విద్యుత కోతలు విధిస్తు న్నారు. ఆ సమయంలో ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసుకు ని ఉండాల్సింది. అలా కాకుండా విద్యుత శాఖ అధికారులు అత్యుత్సాహంపై ప్రజలు విమర్శిస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....