BALAYYA ; మూడోసారీ అవకాశం ఇవ్వండి
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:10 AM
హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ ను మూడోసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నందమూరి వసుం ధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకంఠపురం, డీబీ కాలనీ, డీఆర్ కాలనీ, నానెప్పనగర్, లక్ష్మీపురం, పులమతిరోడ్డు, మోడల్‌కాలనీ ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మా ట్లాడుతూ... బాలకృష్ణ ప్రతిపక్షంలో ఉన్నా అధికార ప క్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తుంటాడన్నారు.
పురాన్ని ఆదర్శంగా నిలుపుతాం
ఎన్నికల ప్రచారంలో వసుంధరాదేవి
హిందూపురం, ఏప్రిల్ 29: హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ ను మూడోసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నందమూరి వసుం ధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకంఠపురం, డీబీ కాలనీ, డీఆర్ కాలనీ, నానెప్పనగర్, లక్ష్మీపురం, పులమతిరోడ్డు, మోడల్‌కాలనీ ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మా ట్లాడుతూ... బాలకృష్ణ ప్రతిపక్షంలో ఉన్నా అధికార ప క్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తుంటాడన్నారు.
ఆయన విదేశా ల్లో ఉన్నా రోజూ హిందూపురం ని యోజకవర్గ పరిస్థితులపై తెలుసు కుంటూ ఉంటారన్నారు. గత టీడీపీ హయాంలో ఎంత అభివృద్ధి చేశారో మీరే చూశారని, ఈసారి గెలిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారన్నారు. రాష్ట్రంలో కూటమి, కేం ద్రంలో ఎనడీఏ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధి స్తుందన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ, బీజేపీ, జనసేన కూట మిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మి, మాజీ చైర్మన అనిల్‌కుమార్, పట్టణాధ్యక్షుడు ర మేష్, కౌన్సిలర్ మంజుల, టీడీపీ నాయకులు నాగరాజు, బేవనహళ్లి ఆనంద్, మంగేష్, బీజేపీ నాయకులు ఆదర్శ్, జనసేన ఉమేష్, ప్రెస్ వెంకటేశ, కదిరప్ప, పరిమళ, నవీన, అంజి, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్ : గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి కౌన్సిలర్‌గా గెలుపొందిన 27వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ తిరిగి సోమవారం టీడీపీ లోకి చేరారు. ఆమెకు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ... బడుగు బలహీనవర్గాలకు టీడీపీనే అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు హిందూపురం అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో వార్డు ఇనచార్జ్ శశికళ, జయసింహ, బూతఇనచార్జ్ గణేష్, రవి, నాగార్జున, పట్టణాధ్యక్షుడు రమేష్, క్లస్టర్ ఇనచార్జ్ రాఘవేంద్ర, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....