SAND : మంచిరోజులు వస్తున్నాయ్..!
ABN , Publish Date - Jul 07 , 2024 | 11:38 PM
హమ్మయ్యా..! ఇంకేం భయం లేదు. ఇక నుంచి ఇసుక ఉచితంగా దొరుకుతుంది. భవన నిర్మాణ రంగం ఊపందు కుంటే తమకు చేతి నిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి రోజుకు 20టన్నుల వరకు మాత్రమే ఉచితంగా ఇసుకను తరలించుకునే అవకాశం ఉం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచి త ఇసుక విధానాన్ని సోమవారం కూటమి ...
నేటి నుంచి ఉచిత ఇసుక విధానం
టన్ను రూ.195గా నిర్ధారించిన ప్రభుత్వం
అనంతపురం క్లాక్‌టవర్/గుత్తి: హమ్మయ్యా..! ఇంకేం భయం లేదు. ఇక నుంచి ఇసుక ఉచితంగా దొరుకుతుంది. భవన నిర్మాణ రంగం ఊపందు కుంటే తమకు చేతి నిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి రోజుకు 20టన్నుల వరకు మాత్రమే ఉచితంగా ఇసుకను తరలించుకునే అవకాశం ఉం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచి త ఇసుక విధానాన్ని సోమవారం కూటమి ప్రభు త్వం ప్రారంభించనుంది. రాయదుర్గం మండలం జంజురాంపల్లి ఇసుక
స్టాక్ పాయింట్‌లో 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. ఇసుక కోసం వ్యక్తి నేరుగా స్టాక్ పాయింట్ దగ్గరకు ఆధార్‌కార్డు, మొబైల్ నంబరు, ఎక్కడికి తరలించాలనే వివరాలతో పా టు వాహనం వెళ్లాల్సి ఉంటుంది. తవ్వకం, లోడింగ్, సీనరీజ్‌తో కలిసి ఒక టన్ను ఇసుక ధరను రూ.195గా నిర్ధారించారు. అక్రమాలకు తావులేకుండా ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తామని భూగర్భగనుల శాఖ డీడీ నాగయ్య తెలిపారు.
జిల్లా ఇసుక కమిటీ ఆధ్వర్యంలో ఇసుక ధర లు నిర్ధారించారు. చైర్మనగా కలెక్టర్, మెంబర్ కన్వీనర్‌గా భూగర్భ గనుల శాఖ డీడీ, సభ్యులుగా జాయింట్ కలెక్టర్, ఎస్పీ, సెబ్ అడిషినల్ ఎస్పీ, గ్రౌండ్‌వాటర్ డీడీ, ఇరిగేషన, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ లు, డీటీసీలు సభ్యులుగా ఉంటారు.
కార్మికుల హర్షం
ఉచిత ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ధరలు భారీగా ఉండటంతో భరించలేక భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని, దీంతో తాము ఉపాధి కోల్పోయినట్లు వారు పేర్కొన్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై కొందరు వలస వెళ్లగా, మరికొందరు అప్పులతో నెట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయనుండటంతో భవన నిర్మాణ రంగం పుంజుకునే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు. ఇక తమకు మంచి రోజులు వచ్చినట్లేనని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఉపాధి లేక ఇబ్బందులు పడ్డాం
గత వైసీపీ ప్రభుత్వ విధానలతో ఇసుక ధర భారం అయ్యింది. దీంతో పట్టణంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇసుక ధర ఎప్పుడు ఎంత ఉంటుందో తెలియని పరిస్థితి ఉండేది. అందుకే భవన నిర్మాణ పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. పనులు లేక పోవడంతో అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తామని చెప్పడంతో భవన నిర్మాణపనులు ఉపందుకుంటాయి.
-వెంకటరాముడు, బేల్దారి, గుత్తి
పనులు దొరికేవి కావు
గత ప్రభుత్వ హయాం లో పనులు దొరకడం కష్టంగా ఉండేది. ఇసుక దొరక్కపోవడంతో భవనాలు నిర్మించడానికి యాజమానులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మాకు కూడా పనులు దొరికేవి కావు. ఇకపై ఈ సమస్య ఉండ దు. ఉచిత ఇసుక విధానం అమలులో వస్తే రోజు పనులు దొరుకుతాయి.
- కృష్ణమూర్తి, భవన నిర్మాణ కూలీ, గుత్తిఆర్‌ఎస్
పస్తులుండాల్సిన అవసరం లేదు
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల కుటుంబాలు పస్తు లు ఉండాల్సిన అవసరం ఉండదు. ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోవడంతో మా లాంటి కార్మికులు చాలా ఇబ్బంది పడ్డాం. పనులు లేక ఇల్లు గడిచేది కాదు. భవన నిర్మాణ పనులు జరగకపోతే దానిమీద ఆధారపడ్డ ఎలకీ్ట్రషియన, టైల్స్, పెయింటర్లు, కార్పెంటర్ పనులు చేసే వారికి కూడా ఉపాధి ఉండదు. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తుండటంతో పనులు దొరుకుతాయి.
- నాగరాజు, కార్పెంటర్, గుత్తి
మరిన్ని అనంతపురం వార్తల కోసం..