LIQUOR : భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , Publish Date - May 01 , 2024 | 12:00 AM
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.2.45లక్షలు విలువైన మద్యాన్ని మం డలంలోని జాతీయ రహదారిపై పాలసముద్రం కూడలి లో మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బ రాయుడు తెలిపారు. దానితోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పాలసముద్రం కూడలిలో గోరంట్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగుళూరు వైపు నుంచి ఏపీ 02సీహెచ6347 నంబర్ గల టాటా ఇండిగో కారు, నంబరు ప్లేట్ లేని ఇతియోస్ కారులో మ ద్యాన్ని గుర్తించారు.
రెండు కార్లు స్వాధీనం, ఒకరి అరెస్టు
గోరంట్ల, ఏప్రిల్ 30: కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.2.45లక్షలు విలువైన మద్యాన్ని మం డలంలోని జాతీయ రహదారిపై పాలసముద్రం కూడలి లో మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బ రాయుడు తెలిపారు. దానితోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
పాలసముద్రం కూడలిలో గోరంట్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగుళూరు వైపు నుంచి ఏపీ 02సీహెచ6347 నంబర్ గల టాటా ఇండిగో కారు, నంబరు ప్లేట్ లేని ఇతియోస్ కారులో మ ద్యాన్ని గుర్తించారు. మొత్తం 40 బాక్స్‌లలో 3,840 హైవా ట్స్ విస్కీ, 90 ఎంఎల్ టెట్రా పాకెట్లను స్వాధీనం చేసు కున్నారు. దానికి సంబంధించి అనంతపురం నగరంలోని రుద్రం పేటకు చెందిన బోయ మాధవ్‌ను అరెస్టు చేయ గా, పామిడి మండలంలోని ఎద్దులపల్లికి చెందిన శేఖర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చిక్‌బళ్లా పూర్ నందినీ వైన్సకు చెందిన మంజునాథ్, క్యాషియర్ జగదీష్‌ను బాధ్యులుగా చేస్తూ కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ ధనుంజయరెడ్డి, పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....