Share News

BALAYYA : వైసీపీ మళ్లీ వస్తే ఆస్తులు వదులుకోవాల్సిందే..

ABN , Publish Date - May 10 , 2024 | 12:34 AM

వైసీపీ మరోసారి అధికారం లోకి వచ్చిందంటే ఆస్తులు వదులుకోవాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో, పట్టణ పరిధిలోని కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఐదే ళ్లలో వైసీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం లో మాన్యం భూములను కబ్జాచేశారని, ప్రభుత్వ భూ మి ఎక్కడ కనిపించినా అమ్మేశారన్నారు. మరోసారి వైసీ పీ వస్తే మనందరి ఆస్తులు వదులుకుని ఊళ్లు విడచాల్సిందేనన్నారు.

BALAYYA : వైసీపీ మళ్లీ వస్తే ఆస్తులు వదులుకోవాల్సిందే..
Balakrishna campaigning in Bevanahalli

ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ

హిందూపురం, మే 9: వైసీపీ మరోసారి అధికారం లోకి వచ్చిందంటే ఆస్తులు వదులుకోవాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో, పట్టణ పరిధిలోని కొన్ని వార్డుల్లో ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ఐదే ళ్లలో వైసీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం లో మాన్యం భూములను కబ్జాచేశారని, ప్రభుత్వ భూ మి ఎక్కడ కనిపించినా అమ్మేశారన్నారు. మరోసారి వైసీ పీ వస్తే మనందరి ఆస్తులు వదులుకుని ఊళ్లు విడచాల్సిందేనన్నారు. నవ్యాంధ్ర నిర్మాత విజనరీ ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కురుబలకు పెద్దపీట...

తెలుగుదేశం పార్టీ హయాంలో కురుబలకు పెద్దపీట వేశామని బాలకృష్ణ అన్నారు. స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో గురువారం వేలాదిగా తరలివచ్చిన కురుబల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ... కురు బలు టీడీపీ వె న్నంటే ఉన్నారని, అందుకే వారికి పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన భార్గవి అనే విద్యార్థిని బాలకృష్ణ, బీకే పార్థసారథి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు.

టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి : వసుంధరాదేవి

చిలమత్తూరు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని నంద మూరి వసుంధరా దేవి పేర్కొన్నారు. ఆమె గురువారం చిలమత్తూరు మండలంలోని కోడూరు, కోట్లోపల్లి, చిన్నప్పరెడ్డి పల్లి, మధురేపల్లి, కందూరుపర్తి, మరసనపల్లిల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె వెంట హిందూపురం మున్సి పల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్ల లక్ష్మి, ఐటీ ప్రొఫెషనల్‌ వింగ్‌ ప్రతినిధి తేజశ్విని, బేకరీ గంగాధర్‌, శ్రీదేవి, మీసేవా సూరి, వెంకటేశులు తదితరులు ఉన్నారు.

Updated Date - May 10 , 2024 | 12:34 AM