రామరాజ్యం కావాలంటే టీడీపీ రావాలి
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:00 AM
రామ రాజ్యం రావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొ న్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర, హెచడీ హళ్లి, ఇరిగేపల్లి, ఆర్‌జీపల్లి, కోడిపల్లి, రామనపల్లి పంచాయతీ కేంద్రాల్లో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోవాలి, రామరా జ్యం రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలన్నారు.
గుండుమల, ఎంఎస్ రాజు
అగళి, ఏప్రిల్ 28: రామ రాజ్యం రావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొ న్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర, హెచడీ హళ్లి, ఇరిగేపల్లి, ఆర్‌జీపల్లి, కోడిపల్లి, రామనపల్లి పంచాయతీ కేంద్రాల్లో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోవాలి, రామరా జ్యం రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవా లన్నారు. నాయకులు, కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో గుండుమల ఆశీస్సులతో ఇక్కడ బరిలో దిగానని తెలిపారు. టీడీపీ నాయకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, జడ్పీటీసీ ఉమేష్, మండల కన్వీనర్ కుమారస్వామి, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మడకశిరటౌన: సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. ఆయన శనివారం రాత్రి హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి పట్ట ్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. అలాగే గుండుమల తిప్పేస్వామి, ఎంఎస్ రాజు సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....