SAND MAFIA: పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు
ABN , Publish Date - May 31 , 2024 | 12:15 AM
కంబదూరు మండలంలోని నూతిమడుగు పెన్నానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి ఇసుకను తరలించేందుకు వచ్చిన టిప్పర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్ సాయంతో తవ్వకాలు జరిపి ప్రతి రోజూ రాత్రి సమయాల్లో ఇసుకను టిప్పర్ల సాయంతో అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
అడ్డుకున్న గ్రామస్థులు
కళ్యాణదుర్గం, మే 30: కంబదూరు మండలంలోని నూతిమడుగు పెన్నానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి ఇసుకను తరలించేందుకు వచ్చిన టిప్పర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్ సాయంతో తవ్వకాలు జరిపి ప్రతి రోజూ రాత్రి సమయాల్లో ఇసుకను టిప్పర్ల సాయంతో అనంతపురం, కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గురువారం రాత్రి అక్రమ తవ్వకాలను గ్రామస్థులంతా అడ్డుకుని వెంటనే తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందించి గంటరన్నర దాటినా ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని వారు ఆరోపించారు. రోజూ రాత్రికి రాత్రే టిప్పర్ల సాయంతో ఇసుకంతా తోడేస్తున్నా సంబంధిత అధికారులకు తెలిసినా తమకు సంబంధం లేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.