Share News

RAIN : పొంచివున్న ప్రమాదం

ABN , Publish Date - May 24 , 2024 | 11:58 PM

భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షా లంటేనే ఆ ప్రాంత ప్రజలు భయాం దోళ చెందుతున్నారు. రెండేళ్ల కిందట తాము పడిన అవస్థలు వారింకా మ రువలేదు. ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో ఉమ్మడి అనంత జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంత కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

RAIN : పొంచివున్న ప్రమాదం
This is how the water overflowed in RTC Colony.. (File)

రెండేళ్ల కిందట భారీ వర్షాలకు

మునిగిన పలు ప్రాంతాలు

ఇప్పటికీ మరిచిపోని ప్రజలు

నియంత్రణ చర్యలేవీ..?

హిందూపురం అర్బన, మే 24: భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షా లంటేనే ఆ ప్రాంత ప్రజలు భయాం దోళ చెందుతున్నారు. రెండేళ్ల కిందట తాము పడిన అవస్థలు వారింకా మ రువలేదు. ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో ఉమ్మడి అనంత జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంత కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2022లో భారీ వర్షాలకు హిందూపురం లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రజలు విలవిల్లాడారు. ఈ ఘటన నుంచి ఇంకా ప్రజలు మరువలేదు. అప్పట్లో వర్షం తగ్గుముఖం పట్టినా... ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో దాదా పు వారం రోజుల పాటు పురంలోని ఆర్టీసీ కాలనీ, త్యాగరాజనగర్‌ దోబీఘాట్‌, శాంతి నగర్‌, రెండో ఆర్టీసీ కాలనీ, రిలియన పెట్రోల్‌ బంక్‌ ప్రధాన రహ దారి, హస్నాబాద్‌, శ్రీకంఠపురం తదితర ప్రాంతాల్లో నీరు తగ్గలేదు.


ఇళ్లలోకి ప్రవేశించడంతో చాల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మరి కొం త మంది బంధువుల ఇళ్లకు చేరారు. ఇళ్లలోని వస్తు వులు తడిసి ముద్దయ్యాయి. ఆహార దినుసులు నీటి లో నాని తినడానికి పనికిరాకుండా పోయాయి. ము ఖ్యంగా ముగురునీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో నిలువ ఉండిపోయింది. దీంతో పరిసర ప్రాంతాలు దుర్గంధభరితమై ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. విష జ్వరాలతో ఆసుపత్రులకు వెళ్లా ల్సిన పరిస్థితులు కొన్ని రోజుల పాటు సాగింది. ము రుగునీటిలోనే పారాడటంతో కొందరికి ఒళ్లంతా ద ద్దుర్లు వచ్చాయి. మరికొందరు చర్మవ్యాధులు భారిన పడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మునిసిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన, వైద్య ఆ రోగ్యశాఖ, అగ్గిమాపకశాఖ, పోలీస్‌ శాఖ అధికారులు ముందస్తు చర్యల కోసం ప్రణాళిక సిద్దం చేసు కోల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్నా దాఖలాలు కనిపించ డం లేదు. ముందుగా వర్షం నీరు లేదా వరద నీరు కాలువల ద్వారా చెరువులకు చేరేలా పెద్ద వంకలు, కాలువల్లో పూడిక తీయించాలి. వాటిలోని పిచ్చి మొ క్కలు తొలగాంచాలి. వంకలు, చెరువు కట్టల లీకే జీలు లేకుండా, వరదనీరు సక్రమంగా వెళ్లేలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. నీటి ప్రవాహానికి అడ్డంకి లేకుండా కాలువలు, వంకలపై అక్రమ కట్డడాలు తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తలు సూచించాల్సిన బాధ్యత రెవెన్యూశాఖపై ఉందంటున్నారు.


చెరువు కట్టలు, వంకలు పరిశీలిస్తున్నాం - యోగానంద్‌, డీఈ, ఇరిగేషనశాఖ

హిందూపురం పరిధిలోని వంకలు, చెరువుల క ట్టలను పరిశీలిస్తున్నాం. బలహీనంగా ఉన్నట్లు అని పిస్తే ఇసుక బ్యాగులు, సిమెంట్‌ ప్యాకింగ్‌ తదితర వాటిని ఉపయోగించి తాత్కాలిక మరమ్మతు చర్య లు చేపడతాం. కాలువులు, వంకలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తాం. వరద నీటి ప్రవాహానికి ఇ బ్బంది లేకుండా ముందస్తుచర్యలు చేపడుతున్నాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 24 , 2024 | 11:58 PM