Share News

DANGER : పొంచివున్న ప్రమాదం

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:07 AM

తాగునీటి బోరు మోటారుకు ఏర్పాటుచేసిన విద్యుత వైర్లను రోడ్డుపై నిర్లక్ష్యంగా పారేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచివుందోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. మండలంలోని కోట్లోపల్లికి తాగునీరు సరఫరా చేసేందుకు సమీపంలోని చెరువులో బోరు వేసి, మోటారు బిగించారు. ఈ బోరు పూర్తిగా రోడ్డుకు ఆనుకొని ఉంది. బోరు మోటారుకు పక్కనే ఉన్న విద్యుత లైను నుంచి విద్యుత సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విద్యుత వైర్లు నిత్యం రద్దీగా ఉన్న రహదారిపై పడేశారు.

DANGER : పొంచివున్న ప్రమాదం
Dangerous drinking water bore electrical cable

చిలమత్తూరు, జూన 19: తాగునీటి బోరు మోటారుకు ఏర్పాటుచేసిన విద్యుత వైర్లను రోడ్డుపై నిర్లక్ష్యంగా పారేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచివుందోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. మండలంలోని కోట్లోపల్లికి తాగునీరు సరఫరా చేసేందుకు సమీపంలోని చెరువులో బోరు వేసి, మోటారు బిగించారు. ఈ బోరు పూర్తిగా రోడ్డుకు ఆనుకొని ఉంది. బోరు మోటారుకు పక్కనే ఉన్న విద్యుత లైను నుంచి విద్యుత సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విద్యుత వైర్లు నిత్యం రద్దీగా ఉన్న రహదారిపై పడేశారు. విద్యుత సరఫరా అయ్యే కేబుల్‌ వైరు రోడ్డుపై ఉన్న నీటి గుంత ల్లో పడి ఉంది.


ఈ కేబుల్‌పైనే పెద్ద పెద్ద లగేజీతో ట్రాక్టర్లు, ఎ ద్దుల బళ్లు, ద్విచక్రవాహనాలు వె ళుతుంటాయి. ఆ మార్గంలోనే ప్రజలు కాలినడకన, పొలాలకు వెళ్లే వారు మూగజీవాలతో వెళు తుంటారు. గొర్రెలు, మేకలు, బరెల్రు ఇలా వందలాది జీవాలు రోజూ నీటిపై తేలాడుతున్న ఈ విద్యుత కేబుల్‌ను తొక్కుకుంటూ వెళుతుంటాయి. తాగునీటి బోరు కావడంతో ఉద యం నుంచి సాయంత్రం వరకు విద్యుత సరఫరా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ కేబుల్‌కు ఎక్కడైనా రంధ్రం పడి, లోపల ఉన్న చిన్నరాగి తీగ బయటికి వచ్చి నా అక్కడున్న నీటికి విద్యుత సరఫరా జరుగుంది. దీంతో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. రెండేళ్లుగా రోడ్డుపై వేసిన విద్యుత వైర్లను మార్చాలని గ్రామస్థులు కోరినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో ఉన్నా రని గ్రామస్థులు వాపోతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదం అందరికీ నిత్యం కనపడుతున్నా కేబుల్‌ను మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా కళ్లెదుట కనపడుతున్న ప్రమాదకర పరిస్థితిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 20 , 2024 | 12:07 AM