Share News

COLLECTOR : ప్రతి నెలా ఇరిగేషన టూర్‌ డైరీ

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:15 PM

జిల్లాలో ఇరిగేషన శాఖలకు చెందిన అధికారులు ప్రణాళికతో అప్రమత్తంగా పనిచేయాలని, ప్రతినెలా ఇంజనీర్‌ టూర్‌ డైరీ అందించాలని కలెక్టరు వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో హెచఎ్‌సఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, ఇతర మైనర్‌ ఇరిగేషన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచఎనఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, మైనర్‌ ఇరిగేషన ఎస్‌ఈలు ప్రతినెలా తప్పకుండా ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలని, అక్కడ జిల్లా సమస్యలు తెలుసుకొని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ప్రాజెక్టులు, కాలువల వివరాలు పూర్తీగా ...

COLLECTOR : ప్రతి నెలా ఇరిగేషన టూర్‌ డైరీ
Collector speaking in review

అధికారులకు కలెక్టరు వినోద్‌ కుమార్‌ ఆదేశాలు

అనంతపురం టౌన, జూన 13: జిల్లాలో ఇరిగేషన శాఖలకు చెందిన అధికారులు ప్రణాళికతో అప్రమత్తంగా పనిచేయాలని, ప్రతినెలా ఇంజనీర్‌ టూర్‌ డైరీ అందించాలని కలెక్టరు వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో హెచఎ్‌సఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, ఇతర మైనర్‌ ఇరిగేషన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచఎనఎ్‌సఎ్‌స, హెచఎల్‌సీ, మైనర్‌ ఇరిగేషన ఎస్‌ఈలు ప్రతినెలా తప్పకుండా ప్రధాన కార్యాలయాలకు వెళ్లాలని, అక్కడ జిల్లా సమస్యలు తెలుసుకొని రాష్ట్ర స్థాయి


అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ప్రాజెక్టులు, కాలువల వివరాలు పూర్తీగా తెలిసేలా గూగుల్‌ మ్యాప్‌ తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. మైనర్‌ ఇరిగేషన పరిధిలో ట్యాంకులు, రిజర్వాయర్లలో చెట్లు, మొక్కలు పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికలు ఇవ్వాలన్నారు. నిపుణులతో సంప్రదించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెట్లు, మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పరిధిలో ఏమైన సమస్యలు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టరు బొల్లినేని వినూత్న, హెచఎనఎ్‌సఎ్‌స ఎస్‌ఈ దేశేనాయక్‌, డిప్యూటీ కలెక్టరు ఆనంద్‌, ఈఈలు రాజస్వరూప్‌, నారాయణనాయక్‌, ప్రతాప్‌, శ్రీనివాసనాయక్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 13 , 2024 | 11:15 PM