ROAD SHOW: బీటీపీ నీటితో కళ్యాణదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:02 AM
బీటీపీ నీటిని తీసుకువచ్చి కళ్యాణదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని శీగలపల్లి, మలయనూరు, నాగేపల్లి, గొల్లరహట్టి, నిజవళ్లి, వెంకటంపల్లి, శ్రీమజ్జనపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
కుందుర్పి, ఏప్రిల్ 29: బీటీపీ నీటిని తీసుకువచ్చి కళ్యాణదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని శీగలపల్లి, మలయనూరు, నాగేపల్లి, గొల్లరహట్టి, నిజవళ్లి, వెంకటంపల్లి, శ్రీమజ్జనపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిలినేనికి టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే బీటీపీ కాలువ పనులు ఆలస్యం అయ్యిందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన్ని ఒప్పించి కాలువ పనులు వేగంతంగా పూర్తి చేసి ఈ ప్రాంతంలోని అన్ని చెరువులకు నీళ్లిచ్చి ప్రజలకు మంచి చేస్తామన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. సూపర్‌సిక్స్ పథకం ద్వారా ఇంటింటికి కొళాయిలు వేయించి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. ఈ పనులన్నీ జరగాలంటే మే 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రభుత్వంలో నాయకులు ఈ గ్రామ ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్నారే తప్ప ఏ గ్రామానికి మట్టి రోడ్డు కూడా వేసిన పాపానపోలేదన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి ఆరు కుటుంబాలు: మండలంలోని నాగేపల్లి గ్రామంలో వైసీపీ నుంచి ఆరు కుటుంబాలు అమిలినేని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి అమిలినేని టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మండల కన్వీనర్ ధనుంజయ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున, మాజీ ఎంపీపీ దీనమ్మ, నాయకులు పెద్ద నరసింహప్ప, మంజునాథరెడ్డి, రామకృష్ణ, సంజీవ, గంగాధర, రాజ్‌కుమార్, ఎర్రగుంట, ఆనంద, కర్తనపర్తి రామాంజనేయులు, రాఘవేంద్ర బాబు, ఓబయ్య అంగడి రామాంజనేయులు, షణ్ముఖ, మడవాళప్ప, తిప్పేస్వామి పాల్గొన్నారు.
మహాశక్తితో ఆర్థిక చేయూత: మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని అమిలినేని కుటుంబ సభ్యులు అన్నారు. మండలంలోని కరిగానిపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో సురేంద్రబాబు సోదరి రాధామాధవి, కుమార్తె చరిత, కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. మే 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ నాగేంద్ర, మాజీ సర్పంచ లింగప్ప, రాఘవేంద్రబాబు, శివలింగప్ప, మోహన రామిరెడ్డి పాల్గొన్నారు.
ఎద్దులబండిపై అమిలినేని ప్రచారం: మండలంలోని బండమీదపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎద్దులబండిలో ఉమ్మడి కూట మి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..