Share News

VILLAGE SECRETRIATE : సచివాలయంలో కొరవడిన సమయపాలన

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:10 AM

మండలంలోని ప లు సచివాలయాల ఉద్యోగులు సమయ పాలన పాటించక ఇ ష్టానుసారంగా వి ధులకు హాజరవు తు న్నారని ఆయా గ్రా మాల ప్రజలు ఆరో పిస్తున్నారు. మండల పరిధిలోని చిగిచెర్ల, నేలకోట, ఏలుకుంట్ల, దర్శినమల, రేగాటిపల్లి తదితర గ్రామాల్లోని సచి వాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు వస్తున్నారని ప్రజలు వా పోతున్నారు. రోజూ ఉదయం 10.30గంటలకు హాజరవుతున్నారని, అది కూడా ఒకరిఇద్దరు మాత్రమే అంటున్నారు. వివిధ పనుల నిమిత్తం సచి వాలయాల వద్దకు వెళ్లి, ఉద్యోగుల కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.

VILLAGE SECRETRIATE : సచివాలయంలో కొరవడిన సమయపాలన
Chigicherla village secretariat not open till 10.20am on Saturday

వేళకురాని ఉద్యోగులు... ప్రజలకు ఇబ్బందులు

పట్టించుకోని మండల అధికారులు

ధర్మవరం రూరల్‌, జూలై6: మండలంలోని ప లు సచివాలయాల ఉద్యోగులు సమయ పాలన పాటించక ఇ ష్టానుసారంగా వి ధులకు హాజరవు తు న్నారని ఆయా గ్రా మాల ప్రజలు ఆరో పిస్తున్నారు. మండల పరిధిలోని చిగిచెర్ల, నేలకోట, ఏలుకుంట్ల, దర్శినమల, రేగాటిపల్లి తదితర గ్రామాల్లోని సచి వాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులకు వస్తున్నారని ప్రజలు వా పోతున్నారు. రోజూ ఉదయం 10.30గంటలకు హాజరవుతున్నారని, అది కూడా ఒకరిఇద్దరు మాత్రమే అంటున్నారు. వివిధ పనుల నిమిత్తం సచి వాలయాల వద్దకు వెళ్లి, ఉద్యోగుల కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు. సచివాలయాలపై మండల స్థాయి అధికారుల పర్యవే క్షణ కొరవడడంతో ఉద్యోగులు ఇష్టాను సారంగా విధులకు వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి ఉద్యోగులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. ఇదేవిషయం పై ఎంపీడీఓ మమతాదేవిని వివరణ కోరగా... సచివాలయ ఉద్యోగులు తప్పక సమయపాలన పాటించాలని అన్నారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10గంటలకు సచివాల యానికి చేరుకోవాలన్నారు. ప్రస్తుతం తానును మెడికల్‌ లీవ్‌లో ఉన్నానని, తప్పక వీటిపై ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2024 | 12:11 AM