POSTAL BALLET : ఆలస్యంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
ABN , Publish Date - May 08 , 2024 | 12:24 AM
స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆర్‌ఓకు టీడీపీ నాయకుల ఫిర్యాదు
హిందూపురం, మే 7: స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 11 గంటలకు పోలింగ్ ప్రారంభమైందది. కొంత మంది ఓటర్లకు అవగాహన లేకపోవడంతో అభ్యర్థి గుర్తు ఉన్నచోట టిక్ పెట్టాల్సింది పోయి కొంత మంది సంతకం పెట్టారు. మరికొంత మంది ఇద్దరికీ టిక్కులు పెట్టారు. దీనిపై కొంత మంది ఓటర్లు చర్చించుకోవడం కనిపించింది. కానీ పోలింగ్ కేంద్రంలో ఉన్న అధికారులు ఓటు ఎలా వినియోగించుకోవాలో తెలుపక పోవడం విశేషం. ఈ విషయాన్ని టీడీపీ ఎలెక్షన ఛీఫ్ ఏజెంట్ అనిల్ కుమార్ అక్కడే ఉన్న ఆర్‌ఓ అభిషేక్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆర్‌ఓ ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు మైక్ ద్వారా వివరించారు. ఎలా వేస్తే ఓటు చెల్లుతుంది? లేకపోతే ఇనవ్యాలీడ్ అవుతుందనే విషయాలను తెలియజేశారు.
తాగునీటికి ఇక్కట్లు: పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి వందలాది మంది వస్తారని తెలిసి కూడా పోలింగ్ కేంద్రం వద్ద తాగునీటి వసతి కల్పించలేదు. అసలే ఎండవేడిమి, ఉక్కుపోతతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కానీ చిన్న క్యాన్లలో నీటిని పెట్టడంతో అవి సరిపోకపోవడంతో ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. దీంతో విషయం తెలుసు కున్న టీడీపీ నాయకులు తాగునీటి వసతి కల్పించారు.
పురంలో ఓటేసిన 802 మంది..
దేశంలో నాలుగో విడత కింద రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబం ధించి మంగళవారం హిందూపురం, పెనుకొండ, మడకశిరకు చెంది న ఓపీఓలు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ సమయంలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో కొంత మంది బుధవారం వినియోగించుకుం దామని వెనుది రిగారు. పోస్టల్ ఓటుహక్కు వినియోగించుకు న్నందుకు ఉపాధ్యాయులు, అంగనవాడీ కార్యకర్తలు, సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయ సిబ్బంది తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా పోస్టల్ బ్యాలెట్ ఆలస్యం కావడంతో వేయడానికి వచ్చిన వారు అసహనం వ్యక్తం చేశారు. హిందూపురంలో 1986 మంది ఓపీఓ లు, జనరల్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నా రు. అయితే హిందూపురం, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి ఉద్యోగులు ఉండగా మంగళవారం 802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....