Share News

SAVITA : సైనికుల్లా విజయం దిశగా దూసుకెళ్లాలి

ABN , Publish Date - May 07 , 2024 | 12:22 AM

ఈ ఎన్నికల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యుద్ధ సైనికుల్లాగా విజయం దిశగా దూసుకెళ్లాలని టీఈపీ కూటమి ఎ మ్మెల్యే సవిత పిలుపునిచ్చారు. ఆమ సోమవారం కలిపి గోరంట్లలోని పుట్ట గుడ్లపల్లి, మల్లాపల్లి, నారసింహపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మల్లాపల్లిలో జరిగిన రోడ్‌ షోలో ఎంపీ అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. వారికి మల్లాపల్లి ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా బీకే, నిమ్మల మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ఆషా మాషీవి కావని, అన్ని శక్తియుక్తులతో వీరసైనికుల్లా ఎ న్నికల కదన రంగంలో పనిచేయాలన్నారు.

SAVITA : సైనికుల్లా విజయం దిశగా దూసుకెళ్లాలి
BK, Savita, Nimmal election campaign

టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలకు సవిత పిలుపు

గోరంట్ల, మే 6: ఈ ఎన్నికల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యుద్ధ సైనికుల్లాగా విజయం దిశగా దూసుకెళ్లాలని టీఈపీ కూటమి ఎ మ్మెల్యే సవిత పిలుపునిచ్చారు. ఆమ సోమవారం కలిపి గోరంట్లలోని పుట్ట గుడ్లపల్లి, మల్లాపల్లి, నారసింహపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మల్లాపల్లిలో జరిగిన రోడ్‌ షోలో ఎంపీ అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. వారికి మల్లాపల్లి ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా బీకే, నిమ్మల మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ఆషా మాషీవి కావని, అన్ని శక్తియుక్తులతో వీరసైనికుల్లా ఎ న్నికల కదన రంగంలో పనిచేయాలన్నారు.


విజయమే లక్ష్యంగా సాగాలని కోరారు. పాతకొత్త కలయిక అయి నందున అందరినీ కలుపుకుని పోవాలన్నారు. వైసీపీపై పోరాటం చేయాలే తప్ప, మన వారిపై కాదని హితవు పలికారు. పోలింగ్‌ రోజున కూడా క్యాడర్‌కు అందు బాటులో ఉంటామని, ఎవరూ భయపడాల్సిన పనిలేద న్నారు. వైసీపీకి కాలం చెల్లిందని, ముందుగానే వారికి తెలసిపోయిందన్నారు. దుర్మార్గపు పాలనను సాగనంప డానికి అందరూ కార్యోన్ముఖులై ఎనిమిదిరోజుల పాటు అవిశ్రాంత పోరాటం చేయాలన్నారు. సవిత మాట్లాడు తూ అడ్రస్‌లేని వ్యక్తికి ఓటు వేస్తే మన అడ్రస్‌ గల్లం తవుతుందన్నారు. సైబీరియన పక్షులకు వేసవిలో వచ్చేందుకు అడ్రస్సు ఉందికానీ, మంత్రి ఉషశ్రీచరణ్‌కు మాత్రం లేదన్నారు.


సంపాదన ఉన్నచోటే ఆమె చిరునామా అన్నారు. ఒకప్పుడు కర్ణాటక, నేడు ఆంధ్ర ఆమె చిరునామా అన్నారు. కల్యాణదుర్గంలో అనకొండ లా దోచేసి, పెనుకొండకు తిమింగలంలా వచ్చింద న్నా రు. రైతులు బాగుడాలన్నా, కియలాంటి పరిశ్రమలు రా వాలన్నా, చెరువులకు నీరు చేరాలన్నా, తాగునీరు కా వాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కోసం సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను, బీకేని గెలిపించాలని పిలుపు నిచ్చారు. పుట్టగుండ్లపల్లి, కొమ్ములతండా, మల్లాపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీలో చేరారు. వారికి సవిత కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సోముశేఖర్‌, నిమ్మల యువశేఖర్‌, నిమ్మల శిరీష్‌, దేవా నరసింహప్ప, వెంకటరెడ్డి, నరేష్‌కుమార్‌యాదవ్‌, మహమ్మద్‌, ఫిరోజ్‌ బాషా, శ్రీధర్‌, నారాయణస్వామి, గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, రామాంజనేయరెడ్డి, మహబూబ్‌సాబ్‌, ఉమ్మర్‌ఖాన తదితరులు, కూటమి నాయకులున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 07 , 2024 | 12:22 AM