MS : టీడీపీతోనే మడకశిర భవిష్యత్తు
ABN , Publish Date - May 04 , 2024 | 11:26 PM
తెలుగుదేశం పార్టీతోనే మడకశిర అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని హులికుంట, గుడ్డగుర్కి, దొడ్డేరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. గ్రామాల్లో అడుగడుగునా హారతులు పట్టి, గజమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా గుండుమల, ఎంఎస్ రాజు మాట్లాడుతూ... ఈ ఐదేళ్లూ మడకశిరలో వైసీపీ రాక్షసపాలన సాగిందన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌రాజు
రొళ్ల, మే 4: తెలుగుదేశం పార్టీతోనే మడకశిర అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు మల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని హులికుంట, గుడ్డగుర్కి, దొడ్డేరి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. గ్రామాల్లో అడుగడుగునా హారతులు పట్టి, గజమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా గుండుమల, ఎంఎస్ రాజు మాట్లాడుతూ... ఈ ఐదేళ్లూ మడకశిరలో వైసీపీ రాక్షసపాలన సాగిందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల న్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ దాసిరెడ్డి, రాష్ట్ర వక్కలిగ కన్వీనర్ బీఎం పాండురంగప్ప, టీఎనటీయూసీ కార్యదర్శి గురుమూర్తి, నాయకులు ఈరన్న, మూర్తి, కృష్ణమూర్తి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మడకశిర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
మడకశిరటౌన: బాలాజీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఎంఎస్ రాజు శనివారం గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన ‘మన మడకశిర ఎంఎస్ రాజు’ అనే పేరుతో మడకశిర ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులోని అంశాలను వివరిస్తూ... హంద్రీనీవా బైపాస్ కెనాల్ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిరకు నీరు సరఫరా చేస్తామన్నారు. అలాగే రాళ్లపల్లి, రత్నగిరి కొల్లాపురమ్మ రిజర్వాయర్ల నిర్మాణం, ఆర్ అనంతపురం పారిశ్రామిక వాడలో పరి శ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన, నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువల వెడల్పు, ప్రతి చెరువుకు కృష్ణా జలాలు చేర్చడమే లక్ష్యమన్నారు. అసంపూర్తిగా ఉన్న గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణం, వక్క పంటకు మార్కెటింగ్ సౌకర్యం, మడకశిర పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం, అగళి మండలం గాయత్రీకాలనీలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన నిధులతో కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన ప్రతి పని పూర్తి చేస్తామన్నారు. అలాగే నగర పంచాయతీలోని వడ్రపాళ్యం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు, హమాలీ అసోసియేషనకు చెందిన 40 కుటుంబాలు, చీపులేటి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. అనంత రంఅభ్యర్థి ఎంఎస్ రాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాజీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌కట్ చేశారు. గుండుమల తిప్పే స్వామి, శ్రీనివాసమూర్తి తదితరులు పట ణంలోని ఆర్‌ఏ పేటనరసింహస్వామి ఆల యంలో విశేష పూజలు చేయించారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
అగళి : టీడీపీని ఆశ్వీర్వదించండి అభి వృద్ధి చేస్తామని టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రా జు సతీమణి ఉమాదేవి పేర్కొన్నారు. ఆ మె శనివారం మండలంలోని ఎంఎం పా ళెం, రామాపురం, అగళి లో బీజేపీ రాయ లసీమజోనల్ ఇనచార్జ్ చంద్రశేఖర్‌తో క లిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....