URUSU : రేపటి నుంచి మస్తానవలి ఉరుసు ఉత్సవాలు
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:07 AM
పట్టణం లోని పాతగుంతకల్లులలో వెలసిన హజరత సయ్యద్ మస్తాన వలి స్వామి 389వ ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవా ల నిర్వహణకు వక్ఫ్ బోర్డు అధికారులు ఏ ర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం గంధం, గురువారం షంషీర్, శుక్రవారం జియారత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.
గుంతకల్లుటౌన, జూలై29: పట్టణం లోని పాతగుంతకల్లులలో వెలసిన హజరత సయ్యద్ మస్తాన వలి స్వామి 389వ ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవా ల నిర్వహణకు వక్ఫ్ బోర్డు అధికారులు ఏ ర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం గంధం, గురువారం షంషీర్, శుక్రవారం జియారత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచా రు. దర్గాను విద్యుత దీపాలతో అలకంరించారు. దర్గా అవరణంలో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంధం, షంషీర్ రోజు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....