Share News

CPI:మోదీ గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలి

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:24 AM

త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎ న్నికల్లో ఎన్డీఏకు 400 సీ ట్లు వస్తాయని ప్రధాన మంత్రి మోదీ గోబెల్స్‌ ప్రచారం చేయడం మా నుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డీ జగదీష్‌ హితవు పలికారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి 30 రాష్ట్రాలలో కేవలం 8 రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. పది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేస్తున్నాయని అన్నారు.

CPI:మోదీ గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలి
మాట్లాడుతున్న జగదీష్‌

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 21: త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎ న్నికల్లో ఎన్డీఏకు 400 సీ ట్లు వస్తాయని ప్రధాన మంత్రి మోదీ గోబెల్స్‌ ప్రచారం చేయడం మా నుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డీ జగదీష్‌ హితవు పలికారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి 30 రాష్ట్రాలలో కేవలం 8 రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీ ఉందన్నారు. పది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేస్తున్నాయని అన్నారు. మరో పది రాష్ట్రాల్లో బీజేపీ లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 స్థానాలు గెలవడం అసాధ్యమన్నారు. ఎన్డీఏకు 150-200 సీట్లు వస్తాయని సర్వేలన్ని చేబుతున్నాయన్నారు.


దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లు ఎండిపోయి, భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో తాగునీటి ఎద్దడి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే ప్రజా సమస్యలపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బీ గోవిందు, నియోజవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, మహేష్‌, గోపినాథ్‌, ఎస్‌ఎండీ గౌస్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:24 AM