Share News

Adcc Bank : కదల బొమ్మాళీ..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:46 AM

ఏడీసీసీ బ్యాంకులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీ చేసినా కదలడం లేదు. ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో వివిధ స్థాయిలో పాతుకుపోయిన ఉద్యోగులను పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌.. ఇటీవల బదిలీ చేశారు. వీరిలో అధికశాతం మంది పదేళ్లకు పైగా పాతుకుపోయిన వారే. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏజీఎంగా పనిచేస్తున్న ప్రసన్నలక్ష్మిని కళ్యాణదుర్గం ప్రాంతీయ అధికారిగా, చీప్‌ మేనేజర్లుగా ఉన్న మనోహర్‌ను ధర్మవరానికి, అనంత పద్మనాభం పాతూరు బ్రాంచకు, డీకే ...

Adcc Bank : కదల బొమ్మాళీ..!
AD CC Bank Head Office

బదిలీ అయినా.. సీటు వీడ

ఏడీసీసీ బ్యాంకులో నిబంధనలు బేఖాతరు

పదేళ్లకు పైగా ప్రధాన కార్యాలయంలో తిష్ట

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 30: ఏడీసీసీ బ్యాంకులో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు బదిలీ చేసినా కదలడం లేదు. ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో వివిధ స్థాయిలో పాతుకుపోయిన ఉద్యోగులను పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌.. ఇటీవల బదిలీ చేశారు. వీరిలో అధికశాతం మంది పదేళ్లకు పైగా పాతుకుపోయిన వారే. ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏజీఎంగా పనిచేస్తున్న ప్రసన్నలక్ష్మిని కళ్యాణదుర్గం ప్రాంతీయ అధికారిగా, చీప్‌ మేనేజర్లుగా ఉన్న మనోహర్‌ను ధర్మవరానికి, అనంత పద్మనాభం పాతూరు బ్రాంచకు, డీకే


దుర్గాప్రసాద్‌ను కదిరికి, అనీల్‌కుమార్‌ రెడ్డిని హిందూపురానికి బదిలీ చేశారు. అయితే, మరి కొంతమంది సీనియర్‌ అధికారులను బదిలీ చేయకుండా అలాగే ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. పైగా బదిలీ అయిన అధికారులు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. గతంలో సీఈఓగా, జీఎంగా పనిచేసిన విజయచంద్రారెడ్డి హైదరాబాద్‌ శిక్షణా కేంద్రానికి బదిలీపై వెళ్లి.. మూడేళ్ల తరువాత తిరిగి వచ్చి డీజీఎంగా బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏడీసీసీ బ్యాంకులో బదిలీల తీరు విమర్శలకు తావిస్తోంది.

కొత్త డీజీఎం చేరికపై చర్చ

మూడేళ్ల క్రితం ఏడీసీసీ బ్యాంకు సీఈఓగా, జీఎంగా పనిచేసి.. హైదరాబాద్‌ సహకార ప్రాంతీయ శిక్షణ కేంద్రానికి బదిలీపై వెళ్ళిన విజయచంద్రారెడ్డి తిరిగి ఇక్కడికే వచ్చారు. ఆయన ఇటీవల డీజీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో బ్యాంకులో చర్చ మొదలైంది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న అధికారి స్థానంలో చేరేందుకే ఆయన తిరిగి ఇక్కడికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు రెండు డీజీఎం పోస్టులు ఉండేవి. ఆయన కోసం మూడో డీజీఎం పోస్టును సృష్టించారు. ఇప్పటికే అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ క్రమంలో మూడో డీజీఎం రావడంతో సమస్య తీవ్రమౌతుందని అంటున్నారు.

వర్గాలుగా ఉద్యోగులు

ఏడీసీసీ బ్యాంకులో ఉద్యోగులు వర్గాలుగా విడిపోయారు. మరోవైపు ఉద్యోగ సంఘాల ప్రభావంతో మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. బ్యాంకు కోసం ఎంతో కష్టపడ్డామని, తమను బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచాలని ఉద్యోగ సంఘాల పేరుతో కొందరు ముందుకువస్తున్నారు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు రిలీవై వెళ్లకుండా అలాగే అంటి పెట్టుకున్నారు. దీంతో ఉద్యోగుల మధ్యే విభేదాలు తలెత్తుతున్నాయి. ఒకే చోట ఏళ్ల తరబడి పాతుకుపోవడంతో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు శాఖలలో డి-ఫారం పట్టాలకు రుణాలు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మూడేళ్లకు ఒకసారి కచ్చితంగా బదిలీ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, అమలుకు నోచుకోవడం లేదు. ఒక బ్రాంచలో పనిచేసిన తరువాత తిరిగి అదే చోటుకు బదిలీ చేయకూడదనే నిబంధనను తుంగలో తొక్కేస్తున్నారు.

వెళ్లాల్సిందే..

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన ఇనచార్జి హోదాలో జాయింట్‌ కలెక్టర్‌ ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జేసీ ఆదేశాల మేరకు బదిలీ అయిన ఉద్యోగులు కచ్చితంగా ఆయా స్థానాల్లో వెళ్లి చేరాల్సిందే. బదిలీ అంశంలో రాజీపడే ప్రసక్తే లేదు. పాలనలో పారదర్శకత కోసం మూడేళ్లకు ఒకసారి కచ్చితంగా బదిలీ చేయాలన్న నిబంధన అమలు చేయడం ఉత్తమం. జేసీ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తాం. బదిలీ అయిన ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- సురేఖరాణి, ఏడీసీసీ బ్యాంకు సీఈఓని ఉద్యోగులు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 12:46 AM