Share News

Sara: నాటు రూటు..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:24 AM

యాడికి మండలంలో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారికి నాయకులు ‘నాటు’ మంత్రం వేస్తున్నారు. ప్రభుత్వ మద్యం కొనాలంటే ఖర్చు ఎక్కువ. అందుకే.. ఖర్చు తక్కువ.. కిక్కు ఎక్కువ అనుకుని.. పేదల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు పూనుకున్నారు. మరోవైపు జె-బ్రాండ్‌ మద్యం అంతా రాజకీయ నాయకులకే సరిపోతోందని మద్యం ప్రియులు నాటు బాట పట్టారు.

Sara: నాటు రూటు..!
natu sara in a bag

కాలేజీ బ్యాగులో నాటుసారా ప్యాకెట్ల రవాణా

యాడికి: మండలంలో నాటు సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారికి నాయకులు ‘నాటు’ మంత్రం వేస్తున్నారు. ప్రభుత్వ మద్యం కొనాలంటే ఖర్చు ఎక్కువ. అందుకే.. ఖర్చు తక్కువ.. కిక్కు ఎక్కువ అనుకుని.. పేదల ఆరోగ్యాన్ని పాడు చేసేందుకు పూనుకున్నారు. మరోవైపు జె-బ్రాండ్‌ మద్యం అంతా రాజకీయ నాయకులకే సరిపోతోందని మద్యం ప్రియులు నాటు బాట పట్టారు. వాటర్‌ ప్యాకెట్‌ సైజ్‌లో ఉండే నాటుసారా ప్యాకెట్‌ను రూ.50కు అమ్ముతున్నారు.


యాడికి కుంటలో తెల్లవారుజామున 5 గంటల నుంచే నాటుసారా ప్యాకెట్ల విక్రయం కొనసాగుతోంది. పిన్నేపల్లిలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఊళ్లో కొందరు నాటుసారా విక్రయాలనే ఉపాధిగా ఎంచుకున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాటు సారా అమ్మితే రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తోందని సమాచారం. నంద్యాల జిల్లా బూరుగల, సీతమ్మ తండా నుంచి నాటు సారా ఈ ప్రాంతానికి వస్తోంది.


అధికారులు దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నా.. నాటుసారా రవాణా ఎలా జరుగుతోందబ్బా.. అని జనం చర్చించుకుంటున్నారు. ఫొటోలో చూస్తున్నారు కదా..? కాలేజీ విద్యార్థులు ఉపయోగించే సంచి నిండా నాటుసారా ప్యాకెట్లే..! శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు..!


మరిన్ని చదవండి...

Updated Date - Apr 22 , 2024 | 12:24 AM