Share News

Water ; నీటి వృథాను అరికట్టిన అఽధికారులు

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:50 AM

పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పైపులైన లీకేజీని పంచాయతీ సిబ్బం ది ఆదివారం అరికట్టా రు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి గోరంట్లలోని ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే పైపులైనకు మార్గమధ్యలో లీకేజీ ఏర్ప డింది. లీకేజీ నీటితో అక్కడ మురుగునీటి గుంట ఏర్ప డింది. ఆ మురుగునీరు మరలా పైప్‌లైన లోకి చేరి నీరు కలుషితమవుతోంది. ఈ విషయంపై ‘కొన్నాళ్లుగా నీటి వృథా’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం కథనం ప్రచురిత మైన విషయం విదితమే.

Water ; నీటి వృథాను అరికట్టిన అఽధికారులు
Panchayat workers repairing leaking pipes

గోరంట్ల, ఏప్రిల్‌ 21: పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పక్కన పైపులైన లీకేజీని పంచాయతీ సిబ్బం ది ఆదివారం అరికట్టా రు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న బోరు నుంచి గోరంట్లలోని ట్యాంక్‌కు నీరు సరఫరా చేసే పైపులైనకు మార్గమధ్యలో లీకేజీ ఏర్ప డింది. లీకేజీ నీటితో అక్కడ మురుగునీటి గుంట ఏర్ప డింది. ఆ మురుగునీరు మరలా పైప్‌లైన లోకి చేరి నీరు కలుషితమవుతోంది.


ఈ విషయంపై ‘కొన్నాళ్లుగా నీటి వృథా’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం కథనం ప్రచురిత మైన విషయం విదితమే. ఈ కథనానికి స్పందించిన ఎంపీడీఓ ప్రవీణ్‌ కుమార్‌ చర్యలు చేపట్టాలని ఈఓఆర్‌డీ సుధాకర్‌ను ఆదేశించారు. దీంతో పంచాయతీ కార్యనిర్వాహణ అఽధికారి బాబురావు సిబ్బందితో పైపులైన మరమ్మతులు చేయించారు.


అయితే ఆ ప్రాంత వాసులు కొందరు లీకేజీ మరమ్మతులకు అభ్యంతరం తెలిపి నట్లు సిబ్బంది తెలిపారు. దీంతో వారిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తురు. ఎవరైనా పైపులైన లీకేజీకి కారకులైతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు పంచాయతీ సిబ్బంది చెప్పారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం

Updated Date - Apr 22 , 2024 | 12:50 AM