Share News

MINISTERS : పరిటాల రవి.. ఓ నిప్పు కణిక

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:09 AM

దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురానికి మంగళవారం వారు విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా గ్రామంలోని యల్లమ్మ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిటాల రవి ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అక్కడ పరిటాల రవి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ...

MINISTERS : పరిటాల రవి.. ఓ నిప్పు కణిక
Ministers Satyakumar Yadav and Savitha paying homage at Paritala Ghat

మంత్రులు సత్యకుమార్‌, సవిత

వెంకటాపురంలో పరిటాల ఘాట్‌కు నివాళులు

రామగిరి, జూలై 2: దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురానికి మంగళవారం వారు విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా గ్రామంలోని యల్లమ్మ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిటాల రవి ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అక్కడ పరిటాల రవి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పరిశీలించారు. అనంతరం మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ పరిటాల రవి అంటే పెత్తందారులు,


భూస్వాములకు సరిపోదని, ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికి మరువలేమన్నారు. ధర్మవరంలో అరాచక శక్తులతో పోరాడి ప్రజలకు అండగా నిలిచారన్నారు. అందుకే ధర్మవరంలో నేటికి ప్రతి ఇంటిలో పరిటాల రవి పేరు చెప్పితే చిరునవ్వు, ధైర్యం కనిపిస్తాయన్నారు. ఆయన పెనుకొండ, ఽధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల ప్రజల కోసం ఎంతో సేవ చేశారన్నారు. ఆయన లక్షణాలు పరిటాల శ్రీరామ్‌ పుణికి పుచ్చుకున్నారన్నారు. ఆయన బాటలోనే శ్రీరామ్‌ నడుస్తూ ప్రజలకు అండగా నిలబడ్డాడన్నారు. వారి వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆస్పత్రి మంజూరు చేయండి

వెంకటాపురం గ్రామానికి వచ్చిన వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు గ్రామస్థులు ఆస్పత్రి కావాలంటూ వినతి పత్రం అందించారు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న నసనకోటలో ఆస్పత్రి ఉన్న అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్నారు. తమ గ్రామంలో రైతులతో పాటు కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారని, పనుల్లో గాయపడితే చికిత్స కోసం 15 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో స్పందించిన మంత్రి ఆస్పత్రి ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 03 , 2024 | 12:09 AM