AITUC: వేతనాలు చెల్లించండి
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:39 AM
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు జీవోనెంబర్ 549 ద్వారా జీతాలు చెల్లించాలన్నారు.
నల్లమాడ, అక్టోబరు 6: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు జీవోనెంబర్ 549 ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఏఐటీయూసీ ద్వారానేకార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గమన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎ్‌సఐ సౌకర్యం కల్పించకుండా వీరి వేతనాల ద్వారా అధికమొత్తంలో డబ్బులు డ్రా చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి కార్మికుడికి రూ.26వేలు జీతం చెల్లించేలా కృషి చేయాలన్నారు. ఆయనతోపాటు కార్మికులు నరసింహులు, శ్యామల, ముత్యాలమ్మ, నరసమ్మ ఉన్నారు.