Yoga day : యోగాతో శాంతి.. సంతృప్తి
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:03 AM
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఖ్యాతి మన దేశానికి దక్కడం గర్వకారణమని అన్నారు. జిల్లా యువజన శాఖ, ఆయుష్, వివేకానంద యోగా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ...
కలెక్టర్ వినోద్‌కుమార్
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఖ్యాతి మన దేశానికి దక్కడం గర్వకారణమని అన్నారు. జిల్లా యువజన శాఖ, ఆయుష్, వివేకానంద యోగా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం యోగాసనాలు వేయాలని, తద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. ఒత్తిళ్ల నడుమ సాగుతున్న జీవితం సంతృప్తి కరంగా, శాంతియుతంగా సాగుతుందని అన్నారు. ఎస్పీ గౌతమి శాలి, జెడ్పీ చైర్ పర్సన బోయ గిరిజమ్మ, సీఈఓ నిదియ, నగర పాలిక కమిషనర్ మేఘ స్వరూప్, అడిషినల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.
- అనంతపురం క్లాక్‌టవర్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....