Share News

Former : పైరు పచ్చని కలలు..!

ABN , Publish Date - Jul 14 , 2024 | 12:19 AM

హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఖరీఫ్‌ సాగు వేగం పెంచారు. వరి నారును సిద్ధం చేసుకున్నారు. తుంగభద్ర జలాల కోసం ఎదురుచూస్తున్నారు. టీబీ డ్యాంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో వర్షపాతం ఆధారంగా.. ఇన ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. డ్యాంలో శనివారం సాయంత్రానికి 30 టీఎంసీలకు పైగా నిల్వలున్నాయి. ఈ ఏడాది సాగునీరు ముందస్తుగానే వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రాజెక్టులో ...

Former : పైరు పచ్చని కలలు..!

హెచ్చెల్సీ ఆయకట్టులో సందడి.. వరి సాగుకు అన్నదాత సన్నద్ధం

బొమ్మనహాళ్‌, జూలై 13: హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఖరీఫ్‌ సాగు వేగం పెంచారు. వరి నారును సిద్ధం చేసుకున్నారు. తుంగభద్ర జలాల కోసం ఎదురుచూస్తున్నారు. టీబీ డ్యాంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో వర్షపాతం ఆధారంగా.. ఇన ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. డ్యాంలో శనివారం సాయంత్రానికి 30 టీఎంసీలకు పైగా నిల్వలున్నాయి. ఈ ఏడాది సాగునీరు ముందస్తుగానే వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు, తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. నీటిని విడుదల చేసే యోచనలో అధికార యంత్రాంగం ఉంది.


రైతుల్లో ఉత్సాహం

ఆయకట్టు రైతుల్లో కొందరు ఇప్పటికే బోరుబావుల కింద వరి సాగు పనులను ప్రారంభించారు. నారు సిద్ధమైనందున.. నాట్లు వేసుకుంటే.. ఆ తరువాత కాలవ నీరు వస్తుందన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. గత ఏడాది అనుభవం రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. గత ఖరీ్‌ఫలో ఆయకట్టు కింద పంటలను కాపాడేందుకు ఆన అండ్‌ ఆఫ్‌ పద్ధతిని అమలు చేశారు. పైగా డ్యాం నుంచి రావాల్సిన రెండు టీఎంసీల నీటి వాటాను తీసుకోవడంలో వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రైతులు నష్టపోయారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం తుంగభద్ర జలాశయం నుంచి నీటి వాటాను సక్రమంగా తీసుకుంటుందని రైతులు విశ్వసిస్తున్నారు. అదే ధీమాతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మనహాళ్‌ మండలంలో 20 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరి, మిరప, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తారు. ప్రతి సీజనలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ వైసీపీ పాలనలో కాలువలు సక్రమంగా లేక.. సాగునీరు సరిగా అందలేదు. రైతులు పంటలు వేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన కొద్ది సమయంలోనే హెచ్చెల్సీ అత్యవసర మరమ్మతు పనులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పూర్తి చేయించారు. దీంతో సాగునీరు సక్రమంగా అందుతుందని రైతులు ధైర్యంగా సాగు పనుల్లోకి దిగారు.

35 ఎకరాలకు..

హెచ్చెల్సీ ఆయకట్టు కింద సొంత పొలం 13 ఎకరాలు, కౌలు భూమి 22 ఎకరాలలో పంట సాగుకు సిద్ధమవుతున్నాను. ఈ ఏడాది మొత్తం 35 ఎకరాలలో వరిపంట సాగు చేస్తున్నాను. వరి విత్తనం కోసం 25 కేజీల ప్యాకెట్లు 25 కొనుగోలు చేసి.. 30 సెంట్ల విస్తీర్ణంలో నారు పోశాను. నెల్లూరు నుంచి వరి విత్తనం తెప్పించాను. ఒక్కో ప్యాకెట్‌ను రూ.1600 ప్రకారం కొన్నాను. నారు పోసేందుకు 30 సెంట్ల భూమిని రూ.15 వేలకు లీజుకు తీసుకున్నాను.

- ఈశ్వర, శ్రీధరఘట్ట

అప్పు తీరుతుందని..

వేసవిలో బోరు బావుల కింద 15 ఎకరాలలో పత్తి పంటను సాగుచేశాను. దిగుబడి రాక పంటను కోల్పోయాను. మూడు లక్షల రూపాయలకుపైగా నష్టపోయాను. ఈ ఖరీ్‌ఫలో వరి దిగుబడి బాగా వస్తే.. పత్తి పంట అప్పును తీరుతుంది. ఆ నమ్మకంతో 18 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తున్నాను. ఇప్పటికే వరినారు కోసం రూ.25 వేలు ఖర్చు చేశాను. తుంగభద్ర డ్యాం నుండి నీరు సకాలంలో వస్తే వరి పంట దిగుబడి బాగా వస్తుంది. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు చొరవ చూపాలి.

- ఆంజనేయులు, గౌనూరు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 12:19 AM