Share News

PLANTS : మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:02 AM

ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పలువురు పేర్కొన్నారు. ఇన్నర్‌వీల్‌, రోటరీ క్లబ్‌, ఇంటర్నేషనల్‌ హ్యూమనరైట్స్‌ ప్రొటెక్షన కమిషన సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎంఈఓ-2 గోపాల్‌నాయక్‌ చేతులమీదుగా మొ క్కలు పంపిణీచేయించారు.

PLANTS :  మొక్కలు నాటి సంరక్షించాలి
MEO-2 Gopal Naik and others planting Mkolu in Dharmavaram

శిక్షా సప్తాహ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎంఈఓలు

ధర్మవరం, జూలై 27: ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పలువురు పేర్కొన్నారు. ఇన్నర్‌వీల్‌, రోటరీ క్లబ్‌, ఇంటర్నేషనల్‌ హ్యూమనరైట్స్‌ ప్రొటెక్షన కమిషన సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎంఈఓ-2 గోపాల్‌నాయక్‌ చేతులమీదుగా మొ క్కలు పంపిణీచేయించారు. ప్రధానంగా కేతిరెడ్డి, ఇందిరమ్మ, వైఎస్‌ఆర్‌ కాలనీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదువేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

కొత్తచెరువు: విద్యావారోత్సవాలలో భాగంగా 6వ రోజు మండల కేంద్రంలోని గాంధీనగర్‌ పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు వారి ఇళ్ల వద్ద పెంచుకోవ డానికి మొక్కలను పంపిణీచేశారు. ఎంఈఓ-2 జయచంద్ర, ఏడీ-2 రామక్రిష్ణ, ఉపాధ్యాయుడు మనోహర్‌ పాల్గొన్నారు.

కదిరిఅర్బన: మున్సిపాలిటీ పరిధి లోని కుటాగుళ్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో శనివారం శిక్షా సప్తాహ్‌లో భాగంగా శనివారం పాఠశాల ఆవరణంతో పాటు, విద్యార్థుల ఇళ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. ఎంఈఓ చెన్నక్రిష్ణ, ఎంఈఓ -2 ఓబులరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వరప్రసాద్‌రాజు పాల్గొన్నారు.

నల్లచెరువు: మండలంలోని వివిధ పాఠశాలలో శిక్షా సప్తాహ్‌లో భాగంగా ఎంఈ ఓ తిరుపాల్‌నాయక్‌ ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు.

నల్లమాడ: మండలంలోని గోపపల్లి ఎంపీయూపీ పాఠశాల, కేజీబీవీ లో శిక్షాసప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఇఓలు వేమనారాయణ, సురేష్‌బా బు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు వెంకటరామిరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ రమాదేవి తదితరుల పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 28 , 2024 | 01:02 AM