Share News

Kharif season : ఆశల సాగుకు సిద్ధం

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:44 AM

అన్నదాతల ఆశల సీజన ఖరీఫ్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది జూన్‌ 1 నుంచి సీజన్‌ ప్రారంభమై సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ఖరీ్‌ఫలో జిల్లాలోని మెట్ట భూముల్లో వర్షాధారం కింద ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లు, కంది 37వేలు, పత్తి 48వేలు, ఆముదం 16వేలు, వరి 18వేల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, ఉలవలు,పెసలు, అలసంద తదితర రకాలు అంతర పంటలు ...

Kharif season : ఆశల సాగుకు సిద్ధం

ఖరీఫ్‌ సీజన ప్రారంభం

70 శాతం దుక్కులు పూర్తి

వర్షం పడితే విత్తేందుకు ఏర్పాట్లు

అనంతపురం అర్బన/ గుత్తి రూరల్‌, జూన 1: అన్నదాతల ఆశల సీజన ఖరీఫ్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది జూన్‌ 1 నుంచి సీజన్‌ ప్రారంభమై సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. ఖరీ్‌ఫలో జిల్లాలోని మెట్ట భూముల్లో వర్షాధారం కింద ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లు, కంది 37వేలు, పత్తి 48వేలు, ఆముదం 16వేలు, వరి 18వేల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, ఉలవలు,పెసలు, అలసంద తదితర రకాలు అంతర పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది జూన మొదటి, రెండో వారంలో జిల్లాకు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


దుక్కి దున్నేస్తున్నారు..

ఈసారి గత నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలోని మెట్టభూముల్లో 70 శాతం దాకా దుక్కులు పూర్తయ్యాయి. దుక్కులు దున్నుకున్న తర్వాత వర్షం పడితే నేరుగా విత్తనం వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. దుక్కులు చేసుకున్న ప్రాంతాల్లో మరో మారు వర్షం పడితే విత్తనం వేసేందుకు రైతులు సిద్దంగా ఉన్నారు. ఖరీఫ్‌ సీజనలో జూన 15 నుంచి జూలై 15 వరకు వేరుశనగ విత్తనం విత్తుకునేందుకు అదును సమయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో విత్తనం వేసుకుంటే దిగుబడులు బాగుంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈనెల 7వతేదీ మృగశిర కార్తె ఆరంభం కానుంది. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు గతంలో కంటే ముందుగానే జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పదును వర్షం పడితే విత్తనం విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. గత ఏడు రోజులుగా జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో విత్తన వేరుశనగ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి దాకా 47వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేశారు.


అంతర పంటల విత్తనాల సబ్సిడీ ధరలు ఖరారైనప్పటికీ ఇంకా పంపిణీ మొదలు పెట్టలేదు. ఇప్పటికే దుక్కులు పూర్తయిన పొలాల్లో మరోసారి వర్షం పడితే విత్తనం వేసేందుకు సిద్ధమైన రైతులు ఎప్పటిలోగా అంతర పంటల విత్తనాలు ఇస్తారంటూ నిట్టూరుస్తున్నారు. కొందరు రైతులు బహిరంగ మార్కెట్‌లో అంతర పంటల విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు సబ్సిడీ అంతర పంటల విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.

నాలుగు రోజుల్లో జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు

ఖరీ్‌ఫలో నైరుతి రుతుపవనాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది జూన మొదటి వారంలోనే నైరుతిరుతుపవనాలు సీమలోకి ప్రవేశిస్తున్నాయి. గురువారం నైరుతిరుతుపవనాలు కేరళను తాకాయి. మరో నాలుగు రోజుల్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. గత ఏడాది జూన 5న కేరళకు నైరుతి రుతుపవనాలు తాకి, జిల్లాలోకి అదే నెల 8న ప్రవేశించాయి.

పదును వర్షం పడితే విత్తేస్తాం

గత నెలలో వర్షాలకు మూడెకరాల్లో సేద్యం పనులు పూర్తి చేశా. ఖరీ్‌ఫలో పదును వర్షం పడితే వేరుశనగ విత్తనం విత్తేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే విత్తన కాయలు రెడీ చేసుకున్నాం. వర్షం కోసమే ఎదురుచూస్తున్నాం.

- సుధాకర్‌, కొత్తపేట, గుత్తి మండలం


వర్షం కోసం ఎదురు చూస్తున్నాం..

నైరుతిరుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నాం. ఈసారి నాలుగెకరాల్లో వేరుశనగ సాగు చేయాలనుకున్నా. వర్షాలు ముందస్తుగా పడితే మృగశిర కార్తెలోనే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఈసారి ముందుగానే రుతుపవనాలు జిల్లాకు వస్తాయని చెబుతున్నారు. ఈసారి వర్షాలు బాగా పడితే మా పంటనండినట్లే.

- నాగేష్‌, జక్కలచెరువు, గుత్తి మండలం

ముందుగానే జిల్లాకు నైరుతి రుతుపవనాలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాదితో పోలిస్తే ముుందుగానే ప్రవేశించే అవకాశం ఉంది. గురువారం రుతుపవనాలు కేరళను తాకాయి. జూన 4 నుంచి 6వ తేదీలోగా జిల్లాలోకి నైరుతిరుతుపవనాలు తాకే అవకాశం ఉంది. రాబోవు ఐదు రోజుల్లో జిల్లాలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

- నారాయణస్వామి, సీనియర్‌ శాస్త్రవేత్త, వాతావరణ విభాగం, రేకులకుంట


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 02 , 2024 | 12:44 AM