BALAYYA : టీడీపీ పాలనలోనే పురం అభివృద్ధి
ABN , Publish Date - May 10 , 2024 | 11:58 PM
అన్ని రకాలుగా వెనుకబ డిన హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరు గులు పెట్టించింది టీడీపీనే అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం చిలమత్తూరు మండలంలో రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 7 గంటలకే సోమఘట్ట నుంచి ప్రచారాన్ని ప్రా రంభించారు. ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పా లనలో నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడవేసిన గొంగళి అక్క డే అన్నట్లు మారిందన్నారు.
ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ
చిలమత్తూరు, మే 10: అన్ని రకాలుగా వెనుకబ డిన హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరు గులు పెట్టించింది టీడీపీనే అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం చిలమత్తూరు మండలంలో రోడ్‌షో నిర్వహించారు. ఉదయం 7 గంటలకే సోమఘట్ట నుంచి ప్రచారాన్ని ప్రా రంభించారు. ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పా లనలో నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడవేసిన గొంగళి అక్క డే అన్నట్లు మారిందన్నారు. తాను ఎమ్మెల్యేగా నియోజ కవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నానన్నారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా చెరువుకు నీరు వదల్లేద న్నా రు.
గత టీడీపీ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నా యన్నారు. వైసీపీ ప్రభుత్వ కల్తీ మద్యంతో అమాయకు ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఒక ప క్క పథకాల పేరుతో డబ్బులు ఇస్తూనే మరో పక్క లబ్ధి దారులకు తెలీయకుండా లాగేస్తున్నారన్నారు. ప్రధానం గా టీడీపీ పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్ర మాలు చేపడుతుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పార్థసారఽథిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనూష, నాయకులు రంగా రె డ్డి, తిప్పారెడ్డి, సోమశేఖర్, నాగరాజు యాదవ్, బయ ప రెడ్డి, లక్ష్మీనారాయణ యాదవ్, బాలాజీ, శ్రీదేవి, రజనీకాంత తదితరులు పాల్గొన్నారు.
దళితుల ద్రోహి జగన
దళితుల ద్రోహి జగన్మోహనరెడ్డి అని ఎమ్మార్పీస్ నా యకుడు, ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ విమర్శించారు. ఆయన శుక్రవారం మండలంలోని సోమ ఘట్టలో నందమూరి బాలకృష్ణను కలిసి రోడ్‌షోలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా దళితులకు టీడీపీలో జరిగిన న్యాయం, వైసీపీలో జరిగిన అన్యాయంపై కరపత్రాలను బాలకృష్ణ ద్వారా విడుదల చేయించారు. నాయకులు బేకరీ గంగాధర్, మధు, అమర్, ఎస్సీ సెల్ నాయకులు సజ్జప్ప, ఉరుము నంజుండ, నరేష్ తదితరలు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....