Share News

ROADS : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

ABN , Publish Date - Jun 29 , 2024 | 12:04 AM

గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే అవి దెబ్బతిని రోడ్లు గుంతలమయం అవుతు న్నాయి. రెండు సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో పలుచోట్ల కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. అవి నేటికీ మరమ్మ తులకు నోచుకోలేదు. దీంతో ద్విచక్రవాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతిని గుంతల మయం అవుతున్నాయి.

ROADS : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
Bumpy main road near Polytechnic

కంకరతేలి గుంతల మయం

తాత్కాలిక మరమ్మతులు చేసినా మళ్లీ యథాస్థితి

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మడకశిర, జూన 28: గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే అవి దెబ్బతిని రోడ్లు గుంతలమయం అవుతు న్నాయి. రెండు సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో పలుచోట్ల కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. అవి నేటికీ మరమ్మ తులకు నోచుకోలేదు. దీంతో ద్విచక్రవాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతిని గుంతల మయం అవుతున్నాయి. మడకశిర మండలంలోని వైబీ హళ్లి రోడ్డుకు గొల్లపల్లి సమీపంలో ఇరువైపులా వేసిన మట్టికొట్టుకుని పోయింది. రోడ్డు పై కంకరతెలింది.


ఆ రోడ్డులో ఉన్న కల్వర్టు మధ్యలో గుంత మాదిరి ఏర్పడడంతో వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండలంలోని అట్టల ఫ్యాక్టరీ సమీపంలోని రోడ్డుపై గతంలో కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాటిని పూడ్చినా, ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు దెబ్బతిని మళ్లీ గుంతల మయమైంది. మధుగిరి రోడ్డు పాలి టెక్నిక్‌ కళాశాల వరకు పలుచోట్ల గుంతలు పడి కంకర తేలింది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుడిబండ మండలంలోని రొళ్ల - గుడిబండ రోడ్డులో కల్వర్టు దెబ్బతింది. అగళి మండలంలోని ప్రధాన రహ దారిలో ఇరిగేపల్లి వద్ద రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు తెగిపోయింది. నేటికీ మరమ్మ తులు చేపట్టలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించే చాలా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రొళ్ల మండలంలోని సీసీగిరి-మల్లినమడుగు, అగ్రహరం-రొళ్ల, రొళ్ల-దొడ్డేరి, ఎం రాయాపురం-జీరిగేపల్లి రోడ్లు కంకరతేలి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 29 , 2024 | 12:04 AM