Share News

RIGHTS : హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:59 PM

కార్మికులు తమ హక్కుల కోసం ఎలా పోరాటాలు చేస్తారో... అదే స్థాయిలో బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని పురం జిల్లా అదనపు కోర్టు న్యాయాధికారి శైలజ అన్నారు. న్యాయాధికారి శనివారం పరిగి మండల పరిధిలోని కొడిగెనహళ్ళి సూపర్‌ స్పిన్నింగ్‌ మిల్లును సందర్శించారు. ఈ సందర్బంగా పరిశ్రమలో పత్తి నుంచి నాణ్యమైన దారం తీయడం, పత్తి బేళ్ల తయారీ, ప్యాకింగ్‌, రవాణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు ఈ పరిశ్రమతో మంచి ఉపాధి లభిస్తుందన్నారు.

RIGHTS : హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించాలి
Shailaja is a magistrate examining cotton in the industry

జిల్లా అదనపు కోర్టు న్యాయాధికారి శైలజ

హిందూపురం అర్బన, మే 25: కార్మికులు తమ హక్కుల కోసం ఎలా పోరాటాలు చేస్తారో... అదే స్థాయిలో బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని పురం జిల్లా అదనపు కోర్టు న్యాయాధికారి శైలజ అన్నారు. న్యాయాధికారి శనివారం పరిగి మండల పరిధిలోని కొడిగెనహళ్ళి సూపర్‌ స్పిన్నింగ్‌ మిల్లును సందర్శించారు. ఈ సందర్బంగా పరిశ్రమలో పత్తి నుంచి నాణ్యమైన దారం తీయడం, పత్తి బేళ్ల తయారీ, ప్యాకింగ్‌, రవాణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు ఈ పరిశ్రమతో మంచి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమలో కార్మికులకు అమలవుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయాధికారి మాట్లా డుతూ... కార్మికులు వారి హక్కులకోసం పోరాటం చేయడమే కాకుండా బాధ్యతలను కూడా గుర్తించాలన్నారు.


కషపడి సంపాదించిన డబ్బుతో తమ పిల్లలను మంచి చదువులు చదివించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్న కార్మికులు ఉచిత న్యాయం కోసం ఎప్పుడైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిం చవచ్చన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసరెడ్డి, మిల్లు జనరల్‌ మేనేజర్‌ సుబ్బరాజు, వివిధ విభాగాల ప్రధాన అధికారులు నరసింహస్వామి, సునీల్‌బాబు, సురేష్‌, లోక్‌ అధాలత సిబ్బంది శారద, హేమలత, లైజనింగ్‌ అధికారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 25 , 2024 | 11:59 PM