Share News

Sand: కేటీఎస్‌ చానల్‌ విధ్వంసకులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - May 22 , 2024 | 12:18 AM

మండలంలోని వేదవతి హగరిలో ఇసుక తరలింపునకు కేటీఎస్‌ చానల్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేపరాల గ్రామస్థులు వన్నూరప్ప, వీరేష్‌, వెంకటేశులు, నాగరాజు, చిన్నరాజప్ప లు కోరారు. ఈమేరకు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ చిట్టిబాబుకు వినతిపత్రం అందించారు.

Sand: కేటీఎస్‌ చానల్‌ విధ్వంసకులపై చర్యలు తీసుకోవాలి
Farmers presenting petition to VRO in Junjurampally

రాయదుర్గంరూరల్‌, మే 21: మండలంలోని వేదవతి హగరిలో ఇసుక తరలింపునకు కేటీఎస్‌ చానల్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేపరాల గ్రామస్థులు వన్నూరప్ప, వీరేష్‌, వెంకటేశులు, నాగరాజు, చిన్నరాజప్ప లు కోరారు. ఈమేరకు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ చిట్టిబాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేటీఎస్‌ చానల్‌ను ఇష్టానుసారంగా ధ్వంసం చేయడంతో వర్షాకాలంలో వర్షపునీరు హగరినదిలోకి వెళుతున్నట్లు తెలిపారు. గతంలో కేటీఎస్‌ చానల్‌ ఉండటంతో వర్షపునీరు కాలువ ద్వారా వచ్చి, బోరుబావులు రీచార్జ్‌ అయ్యేవి అన్నారు.


హగరినది రీచలో ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ ఇలా ధ్వంసం చేసి గుత్తేదారులు వెళ్లిపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక రీచను కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం

మండలంలోని జుంజురంపల్లి సమీపంలోని వేదవతిహగరిలో రీచను కొనసాగించడంతో అడ్డగోలుగా ఇసుకను తరలించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు గ్రామానికి చెందిన లచ్చన్నచౌదరి, బొబ్బిరి రమేష్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సచివాలయంలో వీఆర్వో భీమప్పకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఇసుకరీచ ప్రారంభించడం వల్ల భూగర్భజలాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయన్నారు. దీనివల్ల జుంజురంపల్లి, మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.


ఇసుకరీచ ప్రారంభించడం వల్ల తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో పంట పొలాలు ఎండిపోతున్నా యన్నారు. గుత్తేదారులు 20 అడుగుల నుంచి 40 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయినట్లు తెలిపారు. తమ గ్రామంలో ఇసుకరీచను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ వన్నూరుస్వామి, వీరే్‌షస్వామి, గోవిందరాజులు, తిమ్మారెడ్డి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:18 AM