SAVITA : ఇసుక దొంగలు వస్తున్నారు జాగ్రత్త..!
ABN , Publish Date - May 09 , 2024 | 12:07 AM
పెనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇసుక దొంగలు వస్తున్నారు... తస్మాత జాగ్రత్త... అని ్డ్డ్డటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హెచ్చరించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని వైటీరెడ్డిపల్లి, రంగాపు రం, దొడగట్ట, డీఆర్ కొట్టాల, రెడ్డిపల్లి, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి, ఆర్ కొట్టాల ఆర్ మరువపల్లి, రొద్దం, తిమ్మాపురం, బూదిపల్లి, శేషాపురం, కలిపి, కె మరు వపల్లిల్లో బీకే పార్థసారథితో కలిసి రోడ్‌షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కళ్యాణ దుర్గం నుంచి వలస పక్షి ఉశశ్రీ వచ్చిందని, అక్కడి ఇసుకంతా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుం దని విమర్శించారు.
గ్రామాల్లో ఘనస్వాగతం
రొద్దం, మే 8 : పెనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇసుక దొంగలు వస్తున్నారు... తస్మాత జాగ్రత్త... అని ్డ్డ్డటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హెచ్చరించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని వైటీరెడ్డిపల్లి, రంగాపు రం, దొడగట్ట, డీఆర్ కొట్టాల, రెడ్డిపల్లి, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి, ఆర్ కొట్టాల ఆర్ మరువపల్లి, రొద్దం, తిమ్మాపురం, బూదిపల్లి, శేషాపురం, కలిపి, కె మరు వపల్లిల్లో బీకే పార్థసారథితో కలిసి రోడ్‌షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కళ్యాణ దుర్గం నుంచి వలస పక్షి ఉశశ్రీ వచ్చిందని, అక్కడి ఇసుకంతా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుం దని విమర్శించారు. ఇపటికే రొద్దం, పరిగి మండలాల్లో ఇసుక మాయం అయిపోతోందని కాస్త జాగ్రత్తపడి వచ్చే ఎన్నికల్లో తనకు, బీకేకు ఓటు వేయాలన్నారు. తా ము పక్కా లోకల్ అని, వలసదారులు ఎంతోమంది వస్తుంటారు, దోచుకుని వెళ్తుంటారని విమర్శించారు.
తన తండ్రి రాచంద్రారెడ్డి కాలం నుంచి బీకే పార్థసారథి వరకు చేసిన అభివృద్ది కార్యక్రమాలే నియోజకవర్గంలో కనబడుతున్నాయన్నారు. వైసీపీ వారు అక్రమంగా సంపాదించిన డబ్బును పంపిణీ చేసేందుకు వస్తారని... తనకు, బీకేకు డబ్బులు లేవని కేవలం ప్రజాబలమే ఉందన్నారు. అభివృద్ధి అంటే టీడీపీ, టీడీపీ అంటే అభివృద్ధి అన్నారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బ నాయించిందని మండిపడ్డారు. వైసీపీ వారికి హిందూ పురం పార్లమెంట్ పరిధిలో దమ్మున్న నాయకులు ఎవ రు లేరా అని ప్రశ్నించారు. పెనుకొండకు కియ, నాసెన, బెల్ పరిశ్రమల ఏర్పాటు, గొల్లపల్లి రిజర్వాయర్ లాంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు తెచ్చిన ఘనత చంద్రబా బుకే దక్కుతుందన్నారు. సంపద సృష్టించడం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచిపెట్టడం చంద్రబాబుకే చెల్ల న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీపీ నా యుడు, మాధవనాయుడు, సుబ్బరత్నమ్మ, నరసింహు లు, రామకృష్ణప్ప, నరహరి, కురుబ కృష్ణమూర్తి, నరసింహులు, చిన్నప్పయ్య, ఆర్. కొట్టాల శ్రీనాథ్‌చౌదరి, తిరుపాల్‌నాయుడు, దొడగట్ట రామచంద్ర, శేషాపురం అరుణ్‌రెడ్డి, వీరాంజనేయులు, వాల్మీకిచంద్రశేఖర్, టైలర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఉషశ్రీ.. దిగజారుడు రాజకీయాలు మానుకో...
పెనుకొండ టౌన: వలస పక్షిలాగా వచ్చిన నాయకు రాలు హుందాగా వ్యవహరించాలని, కళ్యాణదుర్గంలో చేసిన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం అ నంతరం రొద్దంలో మాట్లాడారు. పో స్టల్ బ్యాలెట్‌లో అధికార పార్టీకి కను చూపు మేరలో ఓటింగ్ కనిపించలేదన్న అక్కసుతో పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారన్నా రు. నరుకుతాం అనడం దేనికి సంకేత మన్నారు. ప్రశాంతంగా ఉన్న పెనుకొండ ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని, పలు పరిశ్రమలు వస్తు న్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఉషశ్రీ అనుచరులు ఇలా వివాదాస్పదం గా మాట్లాడటం పెనుకొండ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కాదా అని ప్రశ్నించారు అంతటితో వదల కుండా చురుగ్గా పనిచేస్తున్న పట్టణంలోని ఓ కాలనీకి చెందిన తమ అనుచరులను బెదిరించడం మానుకోవాల న్నారు. రాజకీయాన్ని రాజకీయంలాగే చూడాలన్నారు. కార్యక్రమంలో తెలుదు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నాయకులు జీవీపీ నాయుడు, టీడీపీ నేత అరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరుణ్‌రెడ్డి ఆమెను గజమాలతో సత్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....