Share News

COLLECTOR : జ్వరాలు ప్రబలకుండా చూడండి

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:16 AM

జిల్లాలో మలేరియా, డెంగీ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దోమలు ప్రబలే ప్రమాదం ఉందని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఫాగింగ్‌ చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రతంగా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని వసతి ...

COLLECTOR : జ్వరాలు ప్రబలకుండా చూడండి

అనంతపురం టౌన, జూన 18: జిల్లాలో మలేరియా, డెంగీ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దోమలు ప్రబలే ప్రమాదం ఉందని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఫాగింగ్‌ చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రతంగా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని వసతి గృహాలలో మలేరియా సిబ్బంది సహకారంతో ఐఆర్‌ఎస్‌ పిచికారీ చేయించాలని ఆదేశించారు. పంచాయతీలలో చెత్త తొలగించాలని, మురుగునీరు సక్రమంగా


పారేలా చూడాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను క్లోరినేట్‌ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. లార్వాను తినే చేప పిల్లల ఉత్పత్తి, ఎక్కడ వదులుతున్నారో వివరాలను పంపాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులలో వసతులు ఏర్పాటు చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

బడికి పంపండి..

చదువుకుంటేనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ‘బడికి పంపుదాం’ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించి ఉచితంగా చదువు చెప్పిస్తుందని అన్నారు. చదువు లేకపోతే ఎంత సంపద ఉన్నా వ్యర్థమని అన్నారు. ప్రతి చిన్నారినీ బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు. బాల్య


వివాహాలను అడ్డుకోవాలని, బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలని అన్నారు. సమావేశాలలో జేసీ కేతన గార్గ్‌, జడ్పీ సీఈఓ నిదియ, నగరపాలిక కమిషనర్‌ మేఘ స్వరూప్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఆర్వో రామకృష్ణారెడ్డి, డీఎంహెచఓ ఈబీ దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఇనచార్జి డీఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 19 , 2024 | 12:16 AM