Share News

ATHLETICS ; విద్యార్థినులకు క్రీడాపోటీలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:15 AM

పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం ఆర్డీటీ ఆధ్వర్యంలో బాలికలకు క్రీడాపోటీలు నిర్వహించారు. గోరంట్ల, అమడగూరు మండలాల్లోని మొత్తం 11 పాఠశాలలకు చెందిన 145మంది విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీలను ఎంఈఓ జానరెడ్డెప్ప ప్రారంభించారు. అండర్‌ 14, 17, విభాగాలకు చెందిన వారికి పరుగుపందె, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ తదితర క్రీడల్లో పోటీలు జరిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు ఆర్డీటీ రీజనల్‌ డైరెక్టర్‌ శాంతమ్మ, ఎంఈఓ బహుమతులను ప్రదానం చేశారు.

ATHLETICS ; విద్యార్థినులకు క్రీడాపోటీలు
MEO Janareddappa is starting the competition in Gorantal

గోరంట్ల, ఆగస్టు 7: పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం ఆర్డీటీ ఆధ్వర్యంలో బాలికలకు క్రీడాపోటీలు నిర్వహించారు. గోరంట్ల, అమడగూరు మండలాల్లోని మొత్తం 11 పాఠశాలలకు చెందిన 145మంది విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీలను ఎంఈఓ జానరెడ్డెప్ప ప్రారంభించారు. అండర్‌ 14, 17, విభాగాలకు చెందిన వారికి పరుగుపందె, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ తదితర క్రీడల్లో పోటీలు జరిపారు.


ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు ఆర్డీటీ రీజనల్‌ డైరెక్టర్‌ శాంతమ్మ, ఎంఈఓ బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో చిలిచిన విద్యార్థినులు ఈనెల 29న జాతీయ క్రీడాదినోత్సవం రోజు అనంతపురంలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో హెచఎం గోపాల్‌, వివిధ పాఠశాల పీడీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆర్డీటీ ఏటీఎల్‌ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

మడకశిర రూరల్‌: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని ఆర్డీటీ ఆర్డీ మల్లికార్జున, కల్లుమర్రి సర్పంచు గంగ మ్మ, టీడీపీ క్లష్టర్‌ఇనచార్జి నాగరాజు పేర్కొన్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో కల్లుమర్రి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏరియా స్థాయి ఈ పోటీల్లో గెలుపొందిన వారు సెప్టెంబరు 2న జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. హెచ ఎం కృష్టమోహన, పీఈటీ ప్రకాశరెడ్డి ఉపాఽధ్యాయులు, ఆర్టీటీ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ

మడకశిర టౌన: ఆర్డీటీ ఆధ్వర్యంలో కల్లుమర్రిలో బుధవారం నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో మడకశిర కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 200 మీటర్ల పరుగు పందెంలో కే శశికళ మొదటి స్థానంలో నిలిచింది. లాంగ్‌జంప్‌లో ఆర్‌ దీక్ష మొదటి స్థానం, 600 మీటర్ల పరుగుపందెంలో ఎం మధుప్రియ ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో పి నవ్యశ్రీ రెండో స్థానంలో నిలిచారు. అదేవిధంగా 100 మీటర్ల పరుగుపందెంలో కస్తూరి మూడో స్థానంలో నిలిచి బహుమతులను అందుకొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు శశికళ, దీక్ష మధుప్రియలు ఎంపికైనట్లు పీఈటీ అనిత తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 08 , 2024 | 12:15 AM