Share News

BALAYYA : వాల్మీకులను గుర్తించింది టీడీపీనే...

ABN , Publish Date - May 06 , 2024 | 12:12 AM

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకులను గుర్తించి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పురంలోని జేవీఎస్‌ ఫంక్షనహాల్‌లో ఆదివారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవ ర్గంలోని వేలమంది వాల్మీకులు తరలివచ్చారు. ఈ సం దర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వాల్మీకి సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో సింహభాగం కేటాయించామ న్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించామన్నారు.

BALAYYA : వాల్మీకులను గుర్తించింది టీడీపీనే...
Balakrishna speaking at Valmikula atmeeya samavesam

ఆత్మీయ సమావేశంలో

నందమూరి బాలకృష్ణ

హిందూపురం, మే 5: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకులను గుర్తించి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పురంలోని జేవీఎస్‌ ఫంక్షనహాల్‌లో ఆదివారం వాల్మీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవ ర్గంలోని వేలమంది వాల్మీకులు తరలివచ్చారు. ఈ సం దర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వాల్మీకి సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో సింహభాగం కేటాయించామ న్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎంపీతోపాటు రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించామన్నారు. గతంలోనూ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో వాల్మీకులకే అధికం గా ఇచ్చామని గుర్తుచేశారు. వాల్మీకులు అత్యధికంగా టీడీపీవైపు ఉన్నారని, వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో బీసీలపై దాడులు పెరిగాయన్నారు. బీసీల కో సం ప్రత్యేక చట్టం తెస్తున్నామని, అది వారికి కవచంలా పనిచేస్తుందన్నారు.


ఎప్పుడూ టీ డీ పీకి పట్టుకొమ్మల్లా నిలుస్తున్న బీసీలకు ఏమి చ్చినా పార్టీకి వారి రుణం తీర్చు కోలేనిదన్నా రు. ఈ ఎన్నికల్లో బీసీలంతా టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా వాల్మీకి కులసంఘం, టీడీపీ నాయకులు బాలకృష్ణను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు కొల్ల కుంట అంజినప్ప, వాల్మీకి కుల సంఘం నాయకులు ఆదినారాయణప్ప, డీఈ రమేష్‌, బేవనహళ్లి ఆనంద, శివశంకర్‌, వైటీపీ శ్రీనివాస్‌, వైటీపీ వెంకటరమణ, మంజునాథ్‌, బిందు, ఆదినారాయణ, శిరి వరం కిష్టప్ప, రామక్రిష్ణ, రాజశేఖర్‌, సురేష్‌, సాకె ఆంజ నేయులు, సితారా శ్రీనివాసులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


లేపాక్షికి మరింత గుర్తింపు తెస్తాం : వసుంధరాదేవి

లేపాక్షి : మూడోసారి ఎన్నికల బరిలో ఉన్న నంద మూరి బాలకృష్ణను గెలిపిస్తే లేపాక్షికి మరింత గు ర్తిం పు తెస్తామని నందమూరి వసుంధరాదేవి పేర్కొ న్నా రు. ఆమె ఆదివారం మండలంలోని పులమతి పంచా యతీలోని తిలక్‌నగర్‌, శిరివరం పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసుంధరాదేవి సోద రుడు ప్రసాద్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావెళ్ల లక్ష్మి, సుమిత్ర, మండల కన్వీనర్‌ జయప్ప, నాయకుడు మారుతిప్రసాద్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి పలువురి చేరిక

చిలమత్తూరు : మండలంలోని కందూరిపర్తికి చెం దిన 20కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. వారి కి స్థానిక కొడికొండ చెక్‌పోస్టు వద్ద వసుంధరాదేవి సోద రుడు ప్రసాద్‌ టీడపీ కండువాలు వేసి ఆహ్వానించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 06 , 2024 | 12:12 AM