Collector : సమష్టి కృషితో సత్ఫలితాలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:28 PM
సమష్టి కృషితోనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 103 ప్రభుత్వ శాఖలు ఉన్నాయని, ప్రతిశాఖ పోటీపడి పనిచేయాలని సూచించారు. శాఖల పరిధిలో ప్రగతి నివేదికలను రోజువారీగా పంపాలని ఆదేశించారు. రోజువారీ ...
కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం టౌన, జూలై 18: సమష్టి కృషితోనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 103 ప్రభుత్వ శాఖలు ఉన్నాయని, ప్రతిశాఖ పోటీపడి పనిచేయాలని సూచించారు. శాఖల పరిధిలో ప్రగతి నివేదికలను రోజువారీగా పంపాలని ఆదేశించారు. రోజువారీ
సమీక్షలతో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సీజన లేనపుడు కూడా ఆయాశాఖలు నిల్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఉన్నతాధికారులు అడిగినా, అడగకపోయినా జరగాల్సిన పని జరగాలని అన్నా రు. జిల్లా అధికారి అంటే హోదా కాదని, అది బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. నివేదికలు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. సమీక్షలో జేసీ కేతనగార్గ్, జడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియ, డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....